Telangana Elections Live updates

 

Telangana Elections Live updates

 • న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ :

  తెలంగాణ - (119)

  టీఆర్ఎస్ 57

  ప్రజాకూటమి 46

  బీజేపీ 6

  ఎంఐఎం - 00

  ఇత‌రులు - 10

 • ఇండియా టుడే ఎక్జిట్ పోల్స్ :

  తెలంగాణ -  (119) ‍

  టీఆర్ఎస్ 79 -91

  ప్రజాకూటమి 21-33

  బీజేపీ 1-3

  ఎంఐఎం 4- 7

  ఇతరులు- 0

 • ల‌గ‌డ‌పాటి ఎగ్జిట్ పోల్స్ :

  తెలంగాణ  - (119)

  టీఆర్ఎస్ 25 -45

  ప్రజాకూటమి 55-75

  బీజేపీ 5-7

  ఎంఐఎం - 6-7

  ఇత‌రులు - 5-9

 • ఆరా సర్వే ఎక్జిట్ పోల్స్ : 

  తెలంగాణ - (119)

  టీఆర్ఎస్ - 75-85

  ప్రజాకూటమి - 25-35

  బీజేపీ - 2-3

  ఎంఐఎం - 7-8

  ఇతరులు- 0

 • న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ :

  తెలంగాణ - (119)

  టీఆర్ఎస్ 50 -65

  ప్రజాకూటమి 38- 52

  బీజేపీ 4-7

  ఇతరులు 8- 14

 • రిపబ్లిక్ -జన్‌కీబాత్ ఎగ్జిట్ పోల్స్ 

  టీఆర్ఎస్ 50 -65

  ప్రజాకూటమి 38- 52

  బీజేపీ 4-7

  ఇతరులు 10- 12

 • టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ 

  తెలంగాణ - (119)

  టీఆర్ఎస్ - 66

  ప్రజాకూటమి - 37

  బీజేపీ - 7

  ఇతరులు - 9

 • ల‌గ‌డ‌పాటి స‌ర్వేకు ఎందుకంత క్రేజ్.. తెలంగాణ‌లో ఏం చెబుతారు..?

 • ఎగ్జిట్ ఫోల్స్ ఎవ‌రి వైపు.. తెలంగాణ హీరో ఎవ‌రు..?

 • తెలంగాణ బిగ్‌ఫైట్.. లగడపాటి ఎగ్జిట్ పోల్స్‌పై సర్వత్రా నెల‌కొన్న‌ ఆసక్తి

 • తెలంగాణా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించటంలో పోలీసులు అధికారులు సఫలమయ్యారు. చదురు ముదురు సంఘటనలు మినహా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎలాంటి గొడవలు జరగకపోవటం గమనార్హం.

 • ఓటింగ్ జ‌రిగిన విధానం చూస్తే.. 80-85 సీట్లతో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరించడానికి ఏమాత్రం సిద్దంగా లేరు..టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

 • గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో 68.04% ఓటు నమోదు

  తాజా ఎన్నికల్లో ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు 68.05% మేర ఓటింగ్ నమోదు

  ఇంకా కొన్ని చోట్ల కొన‌సాగుతున్న పోలింగ్.. ఓటింగ్ శాతం పై స‌ర్వ‌త్రా ఉత్కంఠత‌

 • భద్రాద్రి కొత్తగూడెం ఎన్నికల అధికారులే లక్ష్యంగా దాడులకు మావోయిస్టుల ప్లాన్

  ప‌క్కా స‌మాచారంతో మావోయిస్టుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

 • తెలంగాణ మ‌హాసంగ్రామం.. ముగిసిన పోలింగ్‌.. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

 • పోలింగ్ గడువు ముగుస్తున్నా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో బారులు తీరిన ఓటర్లు, క్యూలో ఉన్న వారందరికీ అవకాశం. సమస్యాత్మక కేంద్రాల్లో భారీగా భద్రతా దళాల మోహరింపు.

 • ఈరోజు చాలా నిరాశగా ఉంది... అనివార్య కారణాల వల్ల ఓటు వేయలేకపోతున్నా. దయచేసి మీరు ఓటు వేయండి.. ఫేస్‌బుక్ ద్వారా అభిమానులకు సందేశం ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌

 • ఎట్టి పరిస్థితిలో 5 గంటలకు పోలింగ్ ముగిస్తాం.. ఈసీ రజత్ కుమార్

 • సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలోని పొట్టి శ్రీరాములు నగర్ లో ఓట్లు గల్లంతు, సుమారు 100మంది స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన.

 • ఓటింగ్‌కి చివ‌రి నిమిషాలు.. ఓటు వేయనివారు త్వరగా పోలింగ్ బూత్ వద్దకు రావాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి

 • మరి కొద్దిసేపటిలో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ముగియనున్నా పోలింగ్.

 • తెలంగాణ ఎన్నికల్లో టాలీవుడ్ ప్రముఖులు హుషారుగా కుటుంబం మొత్తంతో వచ్చి ఓట్లు వేసి మీడియా ముందుకు వచ్చి తమ వేలికి పెట్టిన చుక్క అందరికి చూపిస్తూ ప్రతి ఒక్కరి బాధ్యత గుర్తు చేశారు.

  నగర ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరగడానికి ఎన్నికల సంఘం, సామాజిక వేదికలు పెద్ద ఎత్తున ప్రచారం సాగించాయి. ఈ ప్రచారానికి సెలబ్రిటీల మద్దతు ఓటింగ్‌ను మరింత పెరిగేలా చేసింది.


  ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, నంద‌మూరి, మ‌హేష్‌బాబులు కుటుంబసమేతంగా విచ్చేసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  మెగా కుటుంబంలో నాగబాబు, అల్లు అర్జున్ ఇతర స్టార్స్ ఓటింగ్ లో పాల్గొన్నారు.

  ఇక దగ్గుబాటి కుటుంబంలో దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు ఓటు వేశారు.


  ఇక నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్, సుహాసిని, తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు.

  అక్కినేని కుటుంబంలో నాగార్జున, అమల ఓటు వేశారు

  సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల దంపతులు, మ‌హేష్‌బాబు న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌లు త‌మ ఓటు హ‌క్కును విన‌యోగించుకున్నారు.


  అలాగే శేఖర్ కమ్ముల, శ్రీకాంత్ ఓటు విజయశాంతి, ఓటింగ్ లో హుషారుగా పాల్గొన్నారు. మంచు లక్ష్మి, ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావులు కూడా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.


  ఇక రాజమౌళి ఓటు హక్కు వినియోగిస్తే రాజమౌళి భార్య రమా రాజమౌళికి ఓటు గల్లంతు కావడంతో షాక్ తగిలింది.

 • ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా నాయక్‌ను అడ్డుకున్న‌ కాంగ్రెస్ కార్యకర్తలు.

 • ఖైర‌తాబాద్‌లో 42, జూబ్లీహిల్స్‌లో 41, స‌న‌త్‌న‌గ‌ర్‌లో 38, నాంప‌ల్లిల్లో 34 శాతం పోలింగ్ న‌మోదైంది.

 • రాత్రి 7గంటలకు లాడగపాటి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో 68.05శాతం పోలింగ్ నమోదయ్యింది, ఈ సారి పోలింగ్ సరళిని బట్టి ఫలితం మారొచ్చని లగడపాటి అన్నారు.

 • తెలంగాణ ఎన్నిక‌ల పోల్.. చివ‌రి అర‌గంట కీల‌కం.. ఓటింగ్ పెరిగే అవ‌కాశం.

 • ఓటు వేశాక మీడియాతో మాట్లాడిన సూప‌ర్ స్టార్ కృష్ణ‌

 • న‌క్సల్స్‌ ప్రభావిత నియోజవకవర్గాలు సిర్పూర్, చెన్నూర్(ఎస్సీ), బెల్లంపల్లి(ఎస్సీ), మంచిర్యాల్, అసిఫాబాద్ (ఎస్టీ), మంథని, భూపాలపల్లి, ములుగు(ఎస్టీ), పినపాక(ఎస్టీ), ఎల్లందు (ఎస్టీ), కొత్తగూడెం, అశ్వారావుపేట(ఎస్టీ), భద్రాచలం (ఎస్టీ) ఈ 13 నియోజ‌కవ‌ర్గాల్లో ఓ గంట ముందుగానే పోలింగ్ ముగిసింది. మిగ‌తా 106 నియోజ‌క‌వ‌ర్గాల్లో 5 గంట‌ల‌కు వ‌ర‌కు స‌మ‌యం ఉంది.

 • తుంగతుర్తి, సూర్యాపేట నియాజకవర్గాల్లో అత్యధికంగా 73శాతం పోలింగ్ నమోదు.

 • 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్‌.. రాష్ట్రంలోని 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది.

 • హైదరాబాద్ లో మందగించిన పోలింగ్, 3గంటల సమయానికి 28.28శాతం నమోదు.

 • ఓటు హ‌క్కు వినియోగించుకున్న ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్

 • ఫతేపురాలో ఘర్షణలు 30నిమిషాల పాటు నిలిచిపోయిన పోలింగ్.

 • గచ్చిబౌలి లోని "జీపీ ఆర్ ఏ" లోని పూలింగ్ బూత్ వద్ద ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటి జయసుధ.

 • త‌గ్గిన పోలింగ్ శాతం.. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు 56.17 శాత‌మే.

 • ఓటు హ‌క్కు వినియోగించుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్

 • ఫిల్మ్‌న‌గ‌ర్ క్ల‌బ్‌లో ఓటు వేసిన మంచు మ‌నోజ్

 • పాతబస్తి, యాకుత్ పురలో ఘర్షణ, రిగ్గింగ్ కు పాల్పడుతున్నారంటూ ఎంఐఎం, ఎంబీటీ కార్యకర్తల పరస్పర ఆరోపణ. రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

 • తన కుటుంబ సభ్యులతో వచ్చి ఓటువేసిన‌ నటి, నిర్మాత చార్మి కౌర్.

 • ఓటు హ‌క్కు వినియోగించుకున్న డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య‌

 • కంగ్రాట్స్ హరీశ్‌ బావ.. నీకు లక్ష మెజార్టీ ఖాయం... నీ దాంట్లో సగం అన్న తెచ్చుకుంట...కేటీఆర్

 • ఓటు హ‌క్కును వినియోగించుకున్న నేచుర‌ల్ స్టార్ నాని.

 • ఓటు హ‌క్కును వినియోగించుకున్న కొణిదల ఉపాస‌న‌.

 • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4గంటలకే ముగియనున్న పోలింగ్, సమయం ముగిసినా క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాం అన్న ఈసీ.

 • ఖమ్మంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి.

 • కేసీఆర్ పై బీజేపీ నేత న‌ల్లూ ఇంద్ర‌సేనా రెడ్డి ఫిర్యాదు..

  ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘిస్తూ.. విజ‌యం త‌మ‌దే అని మీడియాకు తెలిపారని దీంతో ఆయ‌న పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎన్నిక‌ల క‌మీష‌న్‌కు ఫిర్యాదు

 • ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ ను కలిసిన టీడీపీ నేతలు, ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకల గురించి ఫిర్యాదు.

 • తార్నాక సంక్షేమ సంఘం పోలింగ్‌ కేంద్రంలో ఓటేసిన తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం.

 • ఓటుహ‌క్కును వినియోగించుకున్న హీరో రామ్ పోతినేని.

 • ఫిల్మ్‌నగర్ క్లబ్‌ పోలింగ్‌ బూత్‌లో వెయ్యికి పైగా ఓట్లు గల్లంతు.

 • చర్లపల్లి డివిజన్ కుషాయిగూడలోని ప్రగతి విద్యాలయంలో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న మేయర్ బొంతు రామ్మోహన్.

 • హైదరాబాద్ ఖైరతాబాద్ లో ప్రమాదం, ఓటేసి వెలుతున్నవృద్ధురాలు కారు ఢీకొని మృతి.

 • మంత్రి ఈటెల కుటుంబీకుల ఓట్లు గల్లంతు

 • హైదరాబాద్ నుండి సిరిసిల్ల వెళ్తున్న కేటీఆర్, సిద్ధిపేట నుండి వస్తున్న హరీష్ రావు గుర్రాల గొంది వద్ద ఎదురెదురుగా కలుసుకున్నారు. ఆ సమయంలో కేటీఆర్, హరీష్ రావును "కంగ్రాట్స్ బావ" అంటూ పలకరించారు. లక్ష మెజారిటీ వస్తుంది నీకు ఖాయంగా, నీలో సగం అయినా తెచ్చుకుంటే నేను" అని సరదా వ్యాఖ్యలు చేసారు.

 • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో ఓటర్లు అవస్థలు పడుతున్నారు.

  కొంతమంది తమ మొబైల్ ఫోన్లతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించక పోవడంతో తిరిగి వెళ్లిపోయారు.

  పోలింగ్ కేంద్రాల బయట మొబైల్ ఫోన్లను దాచి పెట్టేందుకు సౌకర్యం లేకపోవడంతో పలువురు ఓటర్లు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.

  పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించేది లేదని ఎన్నికల అధికారులు ముందుగా ప్రకటించినా, కనీసం పోలింగ్ కేంద్రాల ముందు ఫోన్ల డిపాజిట్ చేసి వెళ్లేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు.

  దీంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్ పోలింగ్ కేంద్రంలో దివ్యాంగుల కోసం వీల్ ఛైర్లను అందుబాటులో ఉంచక పోవడంతో వారు ఓటేసేందుకు వచ్చి నానా అవస్థలు పడ్డారు.

 • హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న టాలీవుడ్ దిగ్గ‌జ‌ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.

 • ఓటు హ‌క్కు వినియోగించుకున్న రానా ద‌గ్గుబాటి

 • కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ దామోదర రాజనర్సింహా, కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 • రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో 500 ఓట్లు గల్లంతు అయ్యాయని ఓటర్ల ఆందోళనకు దిగారు.

 • వికారాబాద్ జిల్లా నవాబు పేట మండలం ఎల్లకొండలో కాంగ్రెస్ అభ్యర్థి కె.ఎస్.రత్నం కారు ధ్వంసం చేశారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

 • సూర్యాపేటలోని తిరుమలగిరి మున్సిపాలిటీలోని బీసీ కాలనీ 291వ బూత్‌కి సిబ్బంది తాళం వేసి భోజనానికి వెళ్లడంతో రిటర్నింగ్ అధికారి సంజీవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 • చాంద్రాయన్ గుట్ట నియోజకవర్గం రచ్చాపురంలో బీజేపీ అభ్యర్థి సయ్యద్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం, ఓట్లు గల్లంతయ్యాయని ఓటర్ల ఆందోళన.

 • ఆదిలాబాద్‌ జిల్లాలో 32శాతం పోలింగ్‌ నమోదు

  కరీంనగర్‌ జిల్లాలో 35శాతం పోలింగ్‌ నమోదు

  ఖమ్మం జిల్లాలో 32శాతం పోలింగ్‌ నమోదు

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 25శాతం పోలింగ్‌ నమోదు

  వరంగల్‌ జిల్లాలో 34శాతం పోలింగ్‌ నమోదు

  జనగామ జిల్లాలో 25శాతం పోలింగ్‌ నమోదు

  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 32శాతం పోలింగ్‌ నమోదు

  మెదక్‌ జిల్లాలో 35శాతం పోలింగ్‌ నమోదు

  సిద్దిపేట జిల్లాలో 30శాతం పోలింగ్‌ నమోదు

  సంగారెడ్డి జిల్లాలో 30శాతం పోలింగ్‌ నమోదు

  నిజామాబాద్‌ జిల్లాలో 33శాతం పోలింగ్‌ నమోదు

  కామారెడ్డి జిల్లాలో 28శాతం పోలింగ్‌ నమోదు

  కుమ్రం భీం జిల్లాలో 25శాతం పోలింగ్‌ నమోదు

  పెద్దపల్లి జిల్లాలో 28శాతం పోలింగ్‌ నమోదు

  జగిత్యాల జిల్లాలో 26శాతం పోలింగ్‌ నమోదు

  సిరిసిల్ల జిల్లాలో 26శాతం పోలింగ్‌ నమోదు

 • నల్గొండ జిల్లాలో 31శాతం పోలింగ్‌ నమోదు

 • మహబూబ్‌నగర్‌ జిల్లాలో 30శాతం పోలింగ్‌ నమోదు

 • హైదరాబాద్‌లో ఓటు హ‌క్కును వినియోగించుకున్న‌ మంచు లక్ష్మి.

 • హైదరాబాద్‌లో ఓటు హ‌క్కును వినియోగించుకున్న‌ మంచు లక్ష్మి.

 • మీ నియోజ‌క‌వ‌ర్గంలో అభ్యర్థి నచ్చకపోతే నోటా వేయండి.. అంతేగాని ఓటు హక్కును వినియోగించకుండా ఇంట్లో కూర్చోవద్దు. క‌ద‌లిరండి, ఓటేయండి అంటూ అభిమానులకు సందేశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్.రాజమౌళి.

 • ఓటుహ‌క్కును వినియోగించుకున్న సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు


 • ఓటుహ‌క్కును వినియోగించుకున్న సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు

 • ఈ రోజు త‌న సినిమా విడుద‌ల.. అయినా క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తిస్తూ.. హైదరాబాద్‌లో ఓటు వేసిన బెల్లంకొండ శ్రీనివాస్

 • రామాంతపూర్‌.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో బూత్ నెంబర్ 259 లో ఈవీఎం బ్యాటరీ డిశ్చార్జ్ కావడంతో దాదాపు గంట నుండి పోలింగ్ ఆగిపోయింది.

  కొంత మంది ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఇప్పటి వరకు కూడా బ్యాటరీ మార్చడానికి అధికారులు రాలేదు.

  బీజేపీ అభ్యర్థి బాబూ మోహన్, కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డిలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 • డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు సెన్సేష‌న్.. క్యూ లైన్‌లో నిలుచుకోలేక వెళ్లిపోయానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.

  ఇంత వయసొచ్చాక ఆమాత్రం సంస్కారం లేనివాడిని కాదు.

  క్యూ లైన్‌లో జనం ఎక్కువగా ఉండటంతో కాసేపయ్యాక వద్దామని వెళ్లాను త‌ప్పా.. ఎవరూ నన్ను అడ్డుకోలేదు.

  ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నా ఓటు హక్కును వినియోగించుకున్నాను.

 • హైద‌రాబాద్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 28 శాత‌మే పోలింగ్ న‌మోదు.

 • ఓటెత్తిన తెలంగాణ‌.. భారీగా న‌మోద‌వుతున్న పోలింగ్

 • ఒంటి గంట సమయానికి 48.09 శాతం నమోదైన పోలింగ్.

 • జూబ్లిహిల్స్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు హ‌క్కును వినియోగించుకున్న విక్టరీ వెంకటేష్

 • ఓటు హ‌క్కును వినియోగించుకున్న‌ నటి అభినయ.

 • ప‌్ర‌తి ఒక్క‌రు నాకెందుకులే అనుకుంటూ ఇంట్లో కూర్చోకండి.. వచ్చి ఓటేయండి అంటూ.. హీరో వరుణ్ తేజ్

 • తెలంగాణలో హాట్ సీట్లలో ఒకటిగా ఉన్న కొడంగల్‌లో పోలింగ్ జరుగుతుండగా దాడులతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.

  దౌల్తాబాద్ మండలంలోని నాగులపల్లిలో టీఆర్ఎస్ నేత మడిగ శ్రీను అనేక వ్యక్తి, ఆయన సోదరుడిపై కాంగ్రెస్ నేతలు వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి దాడికి దిగారు.

  ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ నేతలు ప్రతి దాడి చేయగా వారిద్దరికీ గాయాలయ్యారు. నలుగురికి తీవ్ర గాయాలు ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

 • కొడంగల్ బాలాజీనగర్‌లో ఓట్లు గల్లంతు.. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

 • టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హుజూర్‌నగర్‌లో భార్య పద్మావతితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 • కొడంగల్ బాలాజీనగర్‌లో ఓట్లు గల్లంతు.. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

 • కొడంగల్ బాలాజీనగర్‌లో ఓట్లు గల్లంతు.. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

 • టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హుజూర్‌నగర్‌లో భార్య పద్మావతితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 • ఎన్నికలను బహిష్కరించిన సూర్యాపేట జిల్లా రంగాపురం, వనపర్తి జిల్లా పశ్యా తాండాల వాసులు, తమ గ్రామాలను పట్టించుకోలేదంటూ ఆవేదన.

 • రాజకీయ పార్టీల నేతలపై దాడులకు సంబంధించి కొన్ని ఫిర్యాదులు అందాయన్న సీఈఓ రజత్ కుమార్. జిల్లా అధికారులను నివేదిక ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

 • సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట కాలనీలో 50 మంది ఓట్లు గల్లంతయ్యాయి. తమకు ఓటు హక్కు కల్పించాలంటూ ఎంఆర్ఓ పరమేశ్వర్‌ను బాధితులు నిలదీశారు.

 • జాంబాగ్ డివిజన్‌, జూబ్లీహిల్స్‌లో కూడా భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. తమ ఓట్లు గల్లంతవ్వడంతో పలుచోట్ల ఓటర్లు ఆందోళనకు దిగారు.

 • చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో 40 వేల ఓట్లు గల్లంతయ్యాయి.

 • ఓటు గల్లంతవటంపై అసహనం వ్యక్తం చేసిన గుత్తా జ్వాలా, ఎన్నికలు పారదర్శకంగా జరగటంలేదంటూ ట్వీట్.

 • అల్వాల్- వెంక‌టాపురం భూదేవి న‌గ‌ర్‌లో.. తొలిసారి ఓటు హ‌క్కు వినియోగించుకున్న ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్

 • ఫిల్మ్‌నగర్‌లో ఓటు హ‌క్కును వినియోగించుకున్న ప్ర‌ముఖ టెన్నిస్ క్రీడాకారిని సానియా మిర్జా

 • ముషిరాబాద్‌లోని రామ్‌నగర్‌లో ఓటేసిన బండారు దత్తాత్రేయ.

 • నిజామాబాద్ ఇందల్వాయి మండలం నల్లవెళ్లిలో ఓట్లు గల్లంతు, స్థానికుల ఆందోళన.

 • మ‌ంచిర్యాల ప‌లు వార్డుల్లో ఓట్లు గ‌ల్లంతు.. నిర‌స‌న తెలుపుతున్న స్థానికులు

 • ఓటు హ‌క్కును వినియోగింకుకున్న ద‌గ్గుబాటి రానా

 • హైదరాబాద్ అమీర్‌పేటలో ఓటు హక్కు వినియోగించుకున్న తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య.

 • ఆందోల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి బాబు మోహన్.

 • హైదరాబాద్ సెయింట్ జామిస్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్.. ఓటు వేయనివారు.. వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలన్న కేటీర్.

 • పాతబస్తీలో ప్రశాంతంగా పోలింగ్, 12శాతం నమోదు- ఎన్నికల అధికారి

 • శేరిలింగంప‌ల్లి హ‌పీజ్‌పేట్లో ఓట్లు గ‌ల్లంతు

 • చింతమడకలో ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన‌ కేసీఆర్.. పోలింగ్ పెద్దఎత్తున జ‌రుగుతుంది.. ఎలాంటి సందేహం లేదు.. గెలుపు మాదే.. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ మీరే చూస్తారు. చింతమడకలో ఓటు వేసిన అనంతరం మీడియాతో కేసీఆర్

 • ఓటు హ‌క్కు వినియోగించుకున్న‌ హీరో మహేష్‌ బాబు, నమ్రతా శిరోద్కర్.

 • ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున జ‌నం త‌ర‌లి వ‌స్తున్నారు.. కేసీఆర్

 • గవర్నర్‌ నరసింహన్‌, కేటీఆర్‌, ఉప్పల్ బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డిలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 • సిరిసిల్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 26 శాతం పోల్ న‌మోదు

 • నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందర్ ను పరామర్శించిన మాజీ ఎంపీ హనుమంతరావు, కుమార్ రావు తదితరులు.

 • చింతమడకలో సతీమణి శోభతో క‌లిసి ఓటు వేసిన కేసీఆర్... వెంట వచ్చిన సిద్ధిపేట టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు.

 • ఎన్నిక‌లు పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గ‌డం లేదు.. బ్యాట్మింటర్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా

 • ఓటు హ‌క్కును వినియోగించుకోండి.. వేసే ప్ర‌తి ఓటు ఎంతో మార్పు తీసుకు వ‌స్తుంద‌ని గ్ర‌హించాలి.. చంద్ర‌బాబు

 • ఓటు హక్కు వినియోగించుకున్నమంత్రి కేటీఆర్

 • పఠాన్ చేరు నియోజకవర్గం అశోక్ నగర్ లో భారీగా ఓట్ల గల్లంతు, ఓటర్ల ఆందోళన

 • కొడంగల్ నియోజ‌క వ‌ర్గంలో హైటెన్షన్..

  కోస్గీలోని నాగులపల్లి టీఆర్ఎస్-కాంగ్రెస్ పరస్పర దాడులు..

  పరిస్థితి ఉద్రిక్తం.. నలుగురికి తీవ్ర గాయాలు.. భారీగా బలగాల మోహరింపు.

 • ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్

 • సిద్దిపేట బూత్ నెంబ‌ర్ 107లో ఓటు వేసిన హ‌రీష్‌రావు

 • ఓటేసేందుకు క్యూ లైన్లో నిల్చున్న నటుడు సంపూర్ణేష్ బాబు.

 • ఓటు వేసే వారికి నిల‌దీసే హ‌క్కు ఉంటుంది.. అక్కినేని నాగార్జున‌

 • పెద్దపల్లి జిల్లా మంథని‌లో పోలింగ్ కేంద్రంలో పార్టీ కండువా కప్పుకొని ప్రచారం చేశారని, టీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమదు ఆయన సతీమణి పుట్ట శైలజపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 • ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తెరాస కార్యకర్తలు ఇళ్లలో తిరుగుతున్నారని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపణ. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని వెల్లడి.

 • పాతబస్తీలోని ఆజంపురాలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ.

 • ఆర్మూర్‌లోని తహశీల్దార్ కార్యాలయం వద్ద స్థానికుల ఆందోళన.. ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించారంటూ ఆందోళన చేస్తున్న ఓటర్లు.. వారితో మాట్లాడుతున్న ఆర్డీవో.

 • న‌ల్గొండ‌.. హాలియాలో భారీగా ఓట్లు గ‌ల్లంతు.

 • ఓటు హక్కు వినోయోగించుకున్న స్వామి పరిపూర్ణానంద

 • జూబ్లీ‌క్లబ్‌లో ఓటు హక్కు వినోయోగించుకున్న మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు..

 • హైదరాబాద్ సెయింట్ జామిస్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ నేత‌ కేటీఆర్

 • హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రాంచరణ్-ఉపాసన దంపతులు

 • అమన్‌గల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ‌చాంద్‌పై దాడి.. తమకు సంబంధం లేదంటున్న బీజేపీ నేత‌లు.

 • కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్, మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచి రెడ్డి కిషన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గణేష్‌ గుప్తా, జీవన్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌, బండారు దత్తాత్రేయ, జిట్టా బాలకృష్ణా రెడ్డి, గొంగిడి సునితా మహేందర్‍రెడ్డి, కే లక్ష్మణ్‌, సానియా మీర్జా, మంచు లక్ష్మి, నటుడు రాజేంద్ర ప్రసాద్‌లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 • పెద్దపల్లి జిల్లా మంథని‌లో పోలింగ్ కేంద్రంలో పార్టీ కండువా కప్పుకొని ప్రచారం చేశారని, టీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమదు ఆయన సతీమణి పుట్ట శైలజపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 • ఓటు వేసేందుకు సొంత ఊర్లకు వెళ్లే వారి వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ఉచిత రవాణా కల్పించాలని సీఈఓ రజత్ కుమార్ సీఎస్‌ను ఆదేశించారు.

 • ఓటు విలువ చాటి చెప్పిన ప‌లువురు సెల‌బ్రిటీలు

 • ప్రముఖ నటుడు కృష్ణ, ఆయన సతీమణి విజయ నిర్మల, ఆమె కుమారుడు నరేష్‌లు జూబ్లిహిల్స్‌లో ఓటేశారు.

 • ఓటు హ‌క్కును వినియోగించుకున్న‌ మంచు లక్ష్మీ.. ప్ర‌తి ఒక్క‌రు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 • జూబ్లిహిల్స్‌లో సినీతారల సందడి.. ఓటేసిన నటీనటులు

 • క‌ల్వ‌కుర్తిలో కాంగ్రెస్-బీజేపీల మ‌ధ్య ఘ‌ర్ష‌న‌లు.

 • పోలింగ్ బూత్ వ‌ద్ద పార్టీ, అభ్య‌ర్ధుల గెలుపు గురించి మాట్లాడ‌నన్న జూనియ‌ర్ ఎన్టీఆర్.. అక్క సుహాసిని గెల‌వాల‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

 • ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించిన ఖమ్మం ఏన్కూరు గ్రామ‌స్తులు.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డం లేద‌ని ఓటింగ్‌కు దూరం.

 • ప‌్ర‌జాకూట‌మి నేత‌ల పై దాడుల‌కు పాల్ప‌డుతున్నారు.. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

 • కల్వకుర్తిలో కాంగ్రెస్ నేత వంశీ చాంద్ రెడ్డిపై దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు.

 • హైదరాబాద్‌లో ఓటేసిన నటుడు జగపతిబాబు.

 • వరంగల్‌ నగరంలో పైడిపల్లి పోలింగ్ స్టేషన్‌లో ఓటేయడానికి వచ్చి కుప్పకూలిన పరమాండ్ల స్వామి అనే వ్యక్తి. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి.

 • మెదక్ నియోజకవర్గంలో ఇప్ప‌టి వరకు 31.23 శాతం నమోదు.

 • ఓటు వేసేందుకు వ‌చ్చిన న‌ర‌సింహా అనే వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో ఈ విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

 • జూబ్లీహిల్స్‌లో ఓటేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల.

 • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని పాత పాల్వంచలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు

 • హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.5లోని యూరో కిడ్స్ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, కాంగ్రెస్ ఖైరతాబాద్ అభ్యర్థి దాసోజు శ్రవణ్.

 • ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్

 • ప‌్ర‌సాద్ ఐమాక్స్‌లో ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకుని సినిమా చూడటానికెళ్లిన ప్రేక్షకుల ఆందోళన.. సిబ్బంది పోలింగ్‌కు వెళ్లడంతో థియేటర్‌లో ఎవరు లేరని ఆందోళన.

 • తెలంగాణ పోలింగ్..ఓటు వేసిన సినీ నటి యాంకర్ ఝాన్సీ

 • హైదరాబాద్ బంజారా హిల్స్ లోని యూరో కిడ్స్ స్కూల్ లో ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ విజయశాంతి, ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దాసోజు శ్రావణ్ కుమార్.

 • వ‌రుణ్‌తేజ్, నిహారిక‌, భార్య ప‌ద్మ‌జ‌తో క‌లిసి ఓటు హక్కు వినియోగించుకున్న మెగా బ్రదర్ నాగబాబు.

 • న‌ల్గొండ‌ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 11.81 శాతం పోలింగ్ న‌మోదు.

 • వ‌రంగ‌ల్ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 11 శాతం పోలింగ్ న‌మోదు.

 • రంగారెడ్డి జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 10 శాతం పోలింగ్ న‌మోదు.

 • కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి అమ్మారెడ్డి ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎంపీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, బీజేపీ అభ్యర్థి మదవనేని రఘునందన్ రావు, బీజెపి అభ్యర్థి బండి సంజయ్, డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ లోకాయుక్త జస్టిస్ సుభాషన్ రెడ్డి, టెస్కోబ్ చైర్మన్ రవీందర్ రావు, మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు, మాజీ మంత్రి డీకే అరుణ, మంద జగన్నథం, మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు, గండ్ర వెంటకరమణారెడ్డి, మధుసూదనాచారి, చల్లా ధర్మారెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిలు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.

 • కరీంనగర్‌లో వైష్ణవి కాలేజీలో టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 • కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో 50% ఓట్లు గల్లంతు అవ్వడంతో రోడ్డు పై గ్రామస్థులు రాస్తా రోకో చేస్తున్నారు.

 • బ్యాట్మింటర్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఓటు మిస్సయింది. బంజారాహిల్స్‌లోని పోలింగ్‌ బూత్‌కు వెళ్లిన జ్వాలా.. జాబితాలో పేరు లేకపోవడంతో వెనుతిరిగింది.

 • గొల్ల‌గూడెంలో ఓటు వేసిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు

 • ఒకటి, రెండు చోట్లే ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్ సమయాన్ని పెంచుతున్నాం.. ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్.

 • రెండున్నర గంటల్లో 10.15 శాతం నమోదైన పోలింగ్

 • మెహ‌దీప‌ట్నంలో ఓటు వేసిన నంద‌మూరి సుహాసిని

 • హ‌రీష్‌రావు.. ప‌ట్ట‌ణ ప్రాంత ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా ఓటు వేయాలి.

 • న‌ల్గొండ ఓటుహ‌క్కును వినియోగించుకున్న కోమ‌టిరెడ్డి

 • నేను ఓటు వేశాను.. మ‌రి మీరు..?

 • బోధన్‌లో ఎంపీ కవిత, రాజేంద్ర నగర్‌లో అసదుద్దీన్‌ ఒవైసీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 • గండిపేట్ మండల్ కిస్మాత్ పూర్‌లో శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్‌ అరగంటకు పైగా లైన్‌లో వేచి ఉన్నారు.

 • ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని కార్మికశాఖ కార్యాలయంలో సీపీఎం జాతీయ నాయకులు బీవీ రాఘవులు ఓటు వేశారు.

 • కార్వాన్‌లోని ఈవీఎం మిషన్స్ పనిచేయకపోవడంతో బీజేపీ అభ్యర్థి అమర్ సింగ్ రీ పోలింగ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.

 • పోలింగ్ చాలా ప్ర‌శాంతంగా జ‌రుగుతోంది. ఈవీయంలు మొరాయించిన‌ట్టు ఎక్క‌డా ఫిర్యాదు రాలేదు.. ర‌జ‌త్ కుమార్

 • ప‌్ర‌తిఒక్క‌రు ఓటు హ‌క్కును వినియోగించుకోవాలి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

 • మైలర్‌దేవ్‌పల్లిలో ఓటేసిన ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ

 • ఎక్క‌డా ఈవియంల స‌మ‌స్య లేదంటున్న ఈసీ.

 • తెలంగాణ వ్యాప్తంగా ఊపందుకున్న పోలింగ్.. ఇప్ప‌టి వ‌ర‌కు 11 శాతం పోలింగ్ న‌మోదు.

 • జూబ్లిహిల్స్‌లో ఓటేసేందుకు.. తల్లితో కలిసి క్యూలో నిలుచున్న జూనియర్ ఎన్టీఆర్, ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి.

  s
 • హ‌రీష్ రావు.. ఈ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక శాతం పోలింగ్ న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది.

 • ప‌లు చోట్ల మొరాయించ‌న ఈవీయంలు.. ఇబ్బంది ప‌డుతున్న రోజు కూలీలు.. నిర్ల‌క్ష్యంగా ఈసీ ధోర‌ణి

 • క‌రీంన‌గ‌ర్.. ఓటుహ‌క్కు వినియోగించుకున్న ఎంపీ వినోద్

 • ఎన్నిక‌ల సిబ్బంది పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌కవ‌ర్గ ఓట‌ర్లు

 • రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఆయన భార్య విమలా నరసింహన్‌‌తో కలిసి రాజ్‌నగర్‌లో ఓటేశారు.

 • పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు వికలాంగులకు సాయపడుతున్న వాలంటీర్లు.

 • తెలంగాణ మొత్తం ఇప్ప‌టికి వ‌ర‌కు 9 శాతం పోలింగ్ న‌మోదు.

 • పోలింగ్‌ విషయంలో ఎన్నికల సంఘం సరైన ఏర్పాట్లు చేయలేదని.. చాలా కేంద్రాల్లో ఓటర్లు ఆందోళనకు దిగారు

 • క‌్యూలో నిల‌బ‌డి ఓటేసిన మెగా స్టార్‌ ఫ్యామిలీ

 • రాష్ట్రంలో 20 కేంద్రాల్లో ఇంకా ప్రారంభం కాని పోలింగ్.

 • ఓటు హక్కు వినియోగించుకున్న ఐజీపీ స్వాతి లక్రా.

 • జగిత్యాలలో ఓట్లు గల్లంతు. ఓటర్ స్లిప్‌లు ఉన్నా ఓటేయలేకపోయిన ప్రజలు.

 • ఇప్పటి వరకు 119 నియోజకవర్గాల్లో 10 శాతం ఓటింగ్.

 • ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 7 శాతం పోలింగ్ న‌మోదు.

 • అడ్డుకున్న ఓట‌ర్లు.. మ‌న‌స్థాపంతో ఓటు వేయ‌కుండా వెనుదిరిగిన రాఘ‌వేంద్ర‌రావు

 • క్యూలో నిల‌బ‌డ‌కుండా ముందుకు వెళ్ళిన రాఘవేంద్ర‌రావు

 • జూబ్లీహిల్స్ క్ల‌బ్ వద్ద ఓటేయ‌డానికి వ‌చ్చిన ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర‌రావు

 • ప‌లు చోట్లు పోలింగ్ కేంద్రాల్లో వెలుతురు స‌రిగ్గా లేద‌ని ఓట‌ర్లు ఫిర్యాదు.

 • ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 7శాతం పోలింగ్ న‌మోదు.

 • మీరూ ఓటేయండి అంటూ నటుడు అక్కినేని నాగార్జున, అమల ట్వీట్

 • హైదరాబాద్ అమీర్ పెట్ లోని డీకే రోడ్ లో 4కేంద్రాల వద్ద ఇంకా ప్రారంభం కానీ పోలింగ్, కొనసాగుతున్న మాక్ పోలింగ్.

 • ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో 6 శాతం పోలింగ్ న‌మోదు

 • కొండారెడ్డిపల్లిలో ఓటేసిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.

 • రంగారెడ్డి పుప్పులగూడ బాలాజీ నగర్‌లో బీజేపీ మహాకూటమి నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బీజేపీ అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 • జూబ్లిహిల్స్‌లో ఓటేసిన కాంగ్రెస్ నాయకుడు, సిని నిర్మాత బండ్ల గణేష్.

 • ఈవీఎంలపై ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించడం లేదు: పోసాని

 • అచ్చంపేట మండలంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.

 • పీవీ సింధు, రాజమౌళి ఇప్పటికే ఓటు వేయగా..జూబ్లీహిల్స్‌లో ఓటు వేసేందుకు అల్లు అర్జున్‌, నాగార్జున, అమల క్యూలైన్లో ఎదురుచూస్తున్నారు.

 • మోత్కుపల్లికి తీవ్ర అస్వస్థత... హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.

 • గవర్నర్ ఓటు వేయాల్సిన రాజ్‌నగర్‌‌లోనూ మొరాయించిన ఈవీఎంలు.

 • హైదరాబాద్ లో పలు చోట్ల ఇంకా ప్రారంభం కానీ పోలింగ్, సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్న ఓటర్లు.

 • జూబ్లిహిల్స్‌లో ఓటేసిన హీరో నితిన్.

 • హైదరాబాద్ లోని కాచీగూడలో పోలింగ్ కేంద్రం -7 వద్ద ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ నేత జి. కిషన్ రెడ్డి.

 • జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి.

 • జూబ్లీ హిల్స్ లోని పోలింగ్ కేంద్రం -152 వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో నిల్చున్న అల్లు అర్జున్.

 • శేరిలింగంపల్లిలో టీడీపీ ఏజెంట్లు ఒకరికి బదులుగా ఒకరు సంతకాలు చేయటంతో లోనికి అనుమతించని అధికారులు, ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు.

 • పాలకుర్తిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు

 • ఓటు హక్కు వినియోగించుకున్న జగదీశ్వర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్, దామోదర్ రెడ్డి.

 • కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించటంతో వాటిని మరమ్మత్తు చేస్తున్న సిబ్బంది.

 • సిద్దిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న తెరాస నేత హరీష్ రావు దంపతులు.

 • రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్.
Bookmark and Share