Andhra Pradesh Assembly and Lok Sabha Election Results Live Updates

 

Andhra Pradesh Assembly and Lok Sabha Election Results Live Updates



  • శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు.


  • కర్నూలులో లోక్‌సభ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి సంజీవ్‌కుమార్‌ విజయం సాధించారు.


  • టీడీపీ మొదటి లోక్‌సభ విజేత : విజయవాడ లోక్‌సభ తెదేపా అభ్యర్థి కేశినేని నాని, వైకాపా అభ్యర్థి ప్రసాద్‌ వి.పొట్లూరిపై విజయం సాధించారు.


  • కోవూరు నుంచి వైసీపీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి 40 వేల భారీ మెజార్టీతో ముందంజలో ఉన్నారు.


  • బనగానపల్లిలో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి 14,049 ఓట్ల మెజారిటీతో విజయం


  • మైలవరంలో 12 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన వైసీపీ అభ్యర్థి వసంతక్రిష్ణ ప్రసాద్


  • అనంతపురం వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య విజయం


  • కళ్యాణదుర్గంలో 20 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన వైసీపీ అభ్యర్థి ఉష శ్రీ చరణ్


  • పశ్చిమ గోదావరిలో 37 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన వైసీపీ అభ్యర్థి గోపాలపురం వెంకటరావ్


  • కడప జిల్లా రాయచోటిలో 32 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి


  • 7 వేల ఓట్ల మెజారిటీతో విజయవాడ వెస్ట్‌లో వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ గెలుపు


  • ఆముదాలవలసలో 13,991 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం


  • పలాసలో వైసీపీ అభ్యర్థి అప్పలరాజు 15,556 ఓట్ల మెజారిటీతో విజయం


  • అనంతపురం అర్భన్ నుంచి 27,285 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామి రెడ్డి


  • గుడివాడ నుంచి 18,112 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి కొడాలి నాని


  • మంత్రాలయంలో 23,657 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన వైసీపీ అభ్యర్థి బాల నాగిరెడ్డి


  • మాడుగుల నుంచి 15,650 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు విజయం


  • ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి 22,440 ఓట్ల మెజారిటీతో గెలుపు


  • మంగళగిరిలో మంత్రి లోకేశ్ ఓటమి, 5,372 మెజారిటీతో వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామ క్రిష్ణారెడ్డి గెలుపు


  • ఆళగడ్డలో టీడీపీ మంత్రి భూమా అఖిల ప్రియ ఓటమి


  • నెల్లూర్‌లో వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గెలుపు, 800 ఓట్ల తేడాతో మంత్రి నారాయణపై విజయం


  • కోవూరు నుంచి వైసీపీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి 25 వేల భారీ మెజార్టీతో ముందంజలో ఉన్నారు.


  • విజయవాడ నుంచి ఎంపీ గా టీడీపీ అభ్యర్థి కేశినేని నాని గెలుపొందారు.


  • విశాఖ జిల్లా యలమంచిలిలో కొనసాగుతున్న కౌంటింగ్,2000 ఓట్ల ఆధిక్యతలో వైసీపీ అభ్యర్థి కన్న బాబు.


  • మంగళగిరిలో ఆసక్తికర వాతావరణం...మెల్లగా తగ్గుతున్న వైసీపీ అభ్యర్థి మెజార్టీ


  • చీరాల నుంచి కరణం బలరామ కృష్ణమూర్తి మరియు ఇచ్ఛాపురం నుంచి బెందాళం అశోక్‌ తెలుగుదేశం పార్టీ తరపున విజయాన్ని సాధించారు.


  • ఈ నెల 30న విజయవాడలో జగన్ ప్రమాణ స్వీకారం


  • ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ


  • గుడివాడ లోక్‌సభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కొడాలి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌పై విజయం సాధించారు.


  • చోడవరంలో వైసీపీ అభ్యర్థి కరణం ధర్మ శ్రీ 28,051 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు


  • కాకినాడ సిటీలో వైసీపీ అభ్యర్థి ద్వారం పూడి చంద్ర శేఖర్ రెడ్డి విజయం సాధించారు.


  • తునిలో వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి ఘన విజయం.


  • కడప జిల్లాకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫలితాలు
    1. పులివెందుల లో వైఎస్ జగన్ ఘన విజయం.. 90వేల 543ఓట్లతో భారీ ఘన విజయం.
    2. కడపలో వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా 52532 ఓట్గ ఆదిక్యతతో గెలుపు.
    3. ప్రొద్దుటూరులో 43200 ఆదీక్యత తొ వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గెలుపు.
    4. మైదుకూరులో వైసీపీ అభ్యర్థి రఘరామిరెడ్డ 27798 ఓట్ల ఆదిక్యతతో విజయం.
    5. బద్వేల్ లో వైసీపీ అభ్యర్ది డాక్టర్ వెంకటసుబ్బయ్య 47 వేల ఓట్ల ఆదీక్యత తో గెలుపు.
    6. జమ్మలమడుగులో వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి 31,515 ఓట్ల ఆదీక్యం.
    7. రైల్వే కోడూలో వైసీపీ అభ్యర్థి కోరుముట్ల శ్రీనివాసులు 24059 ఓట్ల ఆదీక్యంతో గెలుపు.
    8. రాయచోటిలో వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి 20677 ఓట్ల ఆదీక్యంతో గెలుపు.
    9. రాజంపేటలో వైసీపీ అభ్యర్థి మేడా మల్లికార్జున రెడ్డి 27465 ఓట్ల ఆదీక్యంతో విజయం.
    10. కమలాపురం ఎమ్మెల్యే గా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్రనాధ్ రెడ్డి 27 వేలకు పైగా మెజార్టీతో గెలుపు.


  • ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి వైసీపీ అభ్యర్థి టీజెఆర్ సుధాకర్ బాబు గెలుపు.


  • మార్కాపూర్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి కేపీ నాగార్జున రెడ్డి గెలుపొందారు


  • గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి అన్న వెంకట రాంబాబు గెలుపొందారు.


  • చిలకలూరి పేట వైసీపీ మహిళా అభ్యర్థి రజిని విడిదల గెలుపు.


  • గాజువాకలో పవన్ పై వైసీపీ అభ్యర్థి తిప్పా నాగిరెడ్డి విజయం.


  • జనసేన పార్టీ అధినేత పవన్ కు రెండు చోట్లా ఘోర పరాభవం


  • గన్నవరం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ, 712 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, ఇంకా 3 ఈవీఎంలు, 400 పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించాల్సి ఉంది.


  • తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఉండి లో మంతెన రామరాజు మరియు అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్‌ లు విజయం సాధించారు.


  • మార్కాపురం నియోజకవర్గం 17వ రౌండ్ ముగిసే సరికి వైకాపా అభ్యర్థి 16366 మెజార్టీతో ముందున్నారు.


  • భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ 3900 ఓట్ల ఆధిక్యంతో గెలుపు.


  • హిందూపురం 12వ రౌండ్ లో బాలకృష్ణ 14,110 ఓట్ల మెజార్టీ తో ఉన్నారు.


  • బిగ్ బ్రేకింగ్ : భీమవరంలో ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్


  • భీమవరంలో 16 రౌండ్లు ముగిసేసరికి 3800 ఓట్ల వెనుకంజలో పవన్


  • దర్శిలో వైసీపీ అభ్యర్థి వేణుగోపాల్ విజయం


  • ముమ్మిడివరంలో వైసీపీ అభ్యర్థి సతీశ్ కుమార్ విజయం


  • విశాఖ సౌత్‌లో 3893 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేశ్


  • చీపురుపల్లిలో 26,298 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ


  • హిందూపురంలో గెలుపు దిశగా బాలకృష్ణ


  • కొవ్వూరులో వైసీపీ అభ్యర్థి వనిత ఘన విజయం


  • గాజువాక మరియు భీమవరంలో ఓటమి దిశగా పవన్ కళ్యాణ్


  • కమలాపురంలో వైసీపీ అభ్యర్థి రవీందర్ రెడ్డి విజయం సాధించారు.


  • 20 రౌండ్స్ ముగిసే సరికి మచిలీపట్నం లోక్‌సభలో వైసీపీ ఆధిక్యం, 32478 ఓట్ల ఆధిక్యంలో బాలశౌరి ముందంజలో ఉన్నారు.


  • పలమనేరులో వైసీపీ అభ్యర్థి వెంకట్ గౌడ్ విజయం


  • వైసీపీ విజేతలు : ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి,పాలకొండ నుంచి విశ్వాసరాయి కళావతి,అలాగే పిఠాపురం నుంచి పందెం దొరబాబు.


  • ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.


  • ప్రొద్దుటూరు నుంచి బొల్లా బ్రహ్మనాయుడు అనపర్తి నుంచి సత్తి సూర్యనారాయణరెడ్డి,అలాగే బద్వేల్‌ నుంచి వెంకట సుబ్బయ్య వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు.


  • పులివెందులలో 129 మరియు 137 కేంద్రాల ఈవీఎంలకు పోలింగ్‌ అనంతరం సీల్‌ వేయకపోవడం వల్ల అధికారులు పక్కన పెట్టారు.


  • పాలకొండ వైసీపీ కళావతి విజయం


  • గత మెజారిటీ 74,500ను క్రాస్ చేసిన జగన్, 82,540 మెజారిటీతో దూసుకుపోతున్న జగన్


  • మంగళగిరిలో 9వ రౌండు పూర్తయ్యే సరికి లోకేష్ పై వైసీపీ అభ్యర్థి రామకృష్ణ 9,215 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


  • ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్ది డాక్టర్ సురేష్ విజయం


  • ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్ది రాచమల్లు శివప్రసాదరెడ్డి విజయం


  • రాజమండ్రి గ్రామీణం తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి గోరంట్ల బుచ్చియ్య చౌదరి విజయం.


  • అనపర్తి వైసీపీ అభ్యర్ది సత్య సూర్యనారాయణ రెడ్డి విజయం


  • మదనపల్లి వైసీపీ అభ్యర్ది నవాజ్ భాషా విజయం


  • తిరుపతి లోక్‌సభలో 1.52 లక్షల ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాద్‌రావ్ విజయం


  • దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఓటమి అక్కడ వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి గెలుపొందారు.


  • ఉంగుటూలో గెలుపొందిన వైసీపీ


  • ఆవనిగడ్దలో వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు ఘన విజయం


  • ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్ది సుచరిత విజయం


  • రాజమండ్రి సిటీ నుంచి తెలుగుదేశం మహిళా నేత గంగా భవాని గెలుపు.


  • రాజానగరం వైసీపీ అభ్యర్ది జక్కంపూడి రాజా విజయం


  • సర్వేపల్లి వైసీపీ అభ్యర్ది కాకాని గోవర్ధనరెడ్డి విజయం


  • మంగళగిరిలో కొనసాగుతున్న వైసీపీ ఆధిక్యం


  • నరసాపురం వైసీపీ అభ్యర్ది ముదునూరి ప్రసాదరాజు విజయం


  • 15వ రౌండ్లో ముగిసే సరికి నెల్లూరు జిల్లాలోని పరిస్థితి ఇలా ఉంది.

    సూళ్లూరుపేట 15600ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి సంజీవయ్య
    వెంకటగిరిలో 20296ఓట్ల మెజారిటీలో వైసీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి
    సర్వేపల్లిలో 10801ఓట్ల ముందంజలో కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థి కాకాణి
    గూడూరులో 11076ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థి వరప్రసాద్
    నెల్లూరు సిటీలో 2570ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్న వైసీపీ అభ్యర్ధి అనిల్
    నెల్లూరు రూరల్ లో 9961ఓట్ల మెజార్టీలో వైసీపీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    ఆత్మకూరులో 12237ఓట్ల ఆధిక్యంలో వైసీపీ గౌతంరెడ్డి
    కావలిలో 8509ఓట్ల మెజార్టీలో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
    కోవూరులో 12726ఓట్లు మెజార్టీ లో వైస్సార్సీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
    ఉదయగిరిలో 12013 ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి


  • పులివెందులలో 70,400 మెజారిటీతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన విజయం.


  • నర్సాపురంలో 5800 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి ప్రసాద్ రాజు ఘన విజయం


  • తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం తెదేపా అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప విజయం సాధించారు.


  • ఓటమి దిశగా కొనసాగుతున్న మంత్రులు..

    01. కళా వెంకట్రావు

    02. అచ్చెన్నాయుడు

    03. సుజయ కృష్ణ రంగారావు

    04. అయ్యన్నపాత్రుడు

    05. ఘంటా శ్రీనివాసరావు

    06. పితాని

    07. దేవినేని ఉమ.

    08. కొల్లు రవీంద్ర.

    09. పత్తిపాటి పుల్లారావు

    10. నక్కా ఆనందబాబు

    11. లోకేష్.

    12. శిద్దా రాఘవరావు

    13. సోమిరెడ్డి

    14. నారాయణ

    15. అమర్నాధ్ రెడ్డి

    16. కాల్వ శ్రీనివాసులు

    17. అఖిల ప్రియ

    18. ఆది నారాయణ రెడ్డి


  • ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ అభ్యర్థి కరణం బలరాం 12,600 ఓట్లతో గెలుపు


  • పులివెందులలో 74 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న జగన్


  • చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘన విజయం


  • వేమూరులో నక్కా ఆనంద్ బాబు వెనుకంజ


  • పులివెందులలో 78వేల ఓట్ల ఆధిక్యంలో జగన్‌


  • 8 ఓట్ల ఆధిక్యంలో పర్చూరి వైకాపా అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు


  • జనసేన మొట్ట మొదటి విజయం..రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ గెలుపు.


  • కడప లోక్‌సభ వైసీపీ అభ్యర్థి పి.వి.మిథున్‌రెడ్డి ఘన విజయం.


  • మంగళగిరిలో ఓటమి దిశగా లోకేష్


  • 29 వేల మెజార్టీతో కుప్పంలో చంద్రబాబు విజయం సాధించారు.


  • కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చంద్రబాబు విజయం సాధించారు.


  • చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత : టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద వైకాపా కార్యకర్తలు హల్ చల్ చేశారు.జై జగన్ అనే నినాదాలతో పాటు..బై బై బాబు అంటూ కోలాహలం సృష్టించారు.దీనితో అక్కడున్న టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చెయ్యడం తో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తంగా మారింది.


  • భీమవరం 13 రౌండ్స్ పూర్తి అయ్యాయి.5300 ఓట్లతో పవన్ ముందంజ.


  • విజయవాడ పార్లమెంట్ 5వ రౌండ్ పూర్తి అయ్యే సరికి టీడీపీ 1,35,832 వైసీపీ 1,35,813 ఓట్లు పాడగా టీడీపీ 19 ఓట్ల ఆధిక్యంలో ఉంది.


  • దెందులూరులో చింతమనేని ప్రభాకర్ వెనుకంజ


  • దెందులూరులో చింతమనేని ప్రభాకర్ వెనుకంజ


  • గాజువాకలో పవన్ పై 932 ఓట్ల ఆధిక్యంలో తిప్పా నాగిరెడ్డి


  • మార్కాపురం 7వ రౌండ్ లో వైసీపీ 2459 ఆధిక్యం


  • నగరి వైసీపీ అభ్యర్ది రోజా విజయం


  • కడప లోక్ సభ వైసీపీ అభ్యర్ది వై యస్ అనినాష్ రెడ్డి విజయం


  • కుప్పంలో 15వ రౌండ్‌ ముగిసే సరికి చంద్రబాబు 25,156 ఓట్ల ఆధిక్యం.


  • కృష్ణా జిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో వైసిపి అభ్య‌ర్ధి కొడాలి నాని విజ‌యం. ఆయ‌న త‌న స‌మీప టిడిపి అభ్య‌ర్ధి దేవినేని అవినాష్ పై సుమారు 11 వేల ఓట్ల అధిక్య‌త‌తో గెలుపు.


  • బొబ్బిలి వైసీపీ అభ్యర్ది సంపంగి చిన వెంకట అప్పలనాయుడు విజయం


  • గాజువాకలో వైసీపీ హవా..పవన్ పై 3000 వేల ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి తిప్పా నాగిరెడ్డి


  • ఇప్పటి వరకు వైసీపీ 12 స్థానాలు గెలుపొందింది.


  • బాపట్లలో వైసీపీ అభ్యర్థి కోనా రఘుపతి విజయం


  • పామర్రు వైసీపీ అభ్యర్ది బొత్స అనిల్ కుమార్ విజయం


  • శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు గెలుపు.


  • భీమవరంలో 11 వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 4300 మెజార్టీతో పవన్ కళ్యాణ్


  • భీమవరంలో పుంజుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్


  • పులివెందులలో 17వ రౌండ్‌ కి 62వేల ఓట్ల ఆధిక్యంలో జగన్‌


  • చంద్రబాబు కుప్పం నుంచి 22500 ఓట్ల మెజార్టీతో ముందున్నారు.


  • మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామ కృష్ణా రెడ్డి ఘన విజయం


  • పుంగనూరులో పెద్ది రెడ్డి నాగి రెడ్డి భారీ విజయం


  • గజపతినగరం వైసీపీ అభ్యర్ది బొత్స అప్పల నర్సయ్య విజయం


  • విజయవాడ ఈస్ట్ నుంచి 8 రౌండ్ల తరువాత 6835 మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు ముందంజలో ఉన్నారు.


  • నెలిమర్ల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి విజయం


  • తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో ముందు నుంచి జనసేన అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు.


  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారు.


  • మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని నాని విజయం


  • రాజంపేట లోక్‌సభ వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి లక్ష ఓట్లకు పైగా మెజారిటితో ఘన విజయం


  • 25 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ ఆధిక్యం


  • అరకు లో నోటా కి ఎక్కువ ఓట్లు


  • పులివెందులలో 55,000 వేల ఓట్ల ముందంజలో వైఎస్ జగన్


  • రాజోలు లో జనసేన ముందంజ


  • ఈ నెల 30న తిరుపతిలో జగన్ ప్రమాణ స్వీకారం. శ్రీవారి దర్శనం తరువాత సీఎంగా ప్రమాణం చేయనున్న జగన్. తిరుపతిలోని తారక రామ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం.


  • కుప్పంలో 14,333 ఓట్ల ముందంజలో టీడీపీ అధినేత చంద్రబాబు


  • పెడన వైసీపీ అభ్యర్ది జోగి రమేష్ విజయం


  • సత్యవీడు లో వైసీపీ అభ్యర్ది కె ఆదిమూలం విజయం


  • విశాఖ జనసేన అభ్యర్థి వివి లక్ష్మి నారాయణ ముందంజ


  • కడపలో వైసీపీ అభ్యర్థి అంజద్ భాషా విజయం.


  • విజయనగరంలో వైసీపీ అభ్యర్ది కోలగట్ల వీరభద్ర స్వామి విజయం


  • మంగళగిరిలో ఓటమి దిశగా నారాలోకేశ్


  • విజయనగరం జిల్లా పార్వతీపురం వైకాపా అభ్యర్థి జోగారావు విజయం.


  • తిరుపతి తారకరామ స్టేడియంలో జగన్ ప్రమాణ స్వీకారంకు ముహూర్తం


  • భీమవరం 7వ రౌండ్ లో 1200 ఓట్ల ఆధిక్యంలో పవన్


  • మొట్టమొదటి విజయం : ప.గో జిల్లా చింతలపూడిలో వైసీపీ అభ్యర్థి ఎలిజా 31,800 ఓట్ల మెజార్టీ తో గెలుపు.


  • నర్సాపురం నాలుగో రౌండ్ ముగిసే సరికి కే ఏ పాల్ కు 102 ఓట్లు


  • పార్లమెంట్ స్థానాల్లో కూడా వైసీపీ ప్రభంజనం 25 స్థానాల్లోనూ ముందంజ.


  • భీమవరం ఐదో రౌండ్ లో వైసీపీ ఆధిక్యం


  • అరకు ఐదో రౌండ్ లో స్వతంత్ర అభ్యర్థి ఆధిక్యం


  • 6,600 ఓట్ల ఆధిక్యంలో శ్రీకాకుళం లోక్‌సభ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఉన్నారు.


  • కుప్పంలో పదో రౌండు ఓట్ల లెక్కింపు ముగిసే సరికి చంద్రబాబు 10,886 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


  • లగడపాటి ఎక్కడా అంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్లు


  • పర్చూరు వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు మూడో రౌండ్‌ ముగిసే సరికి 317 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఉన్నారు.


  • మంగళగిరిలో భారీ ఓటమి దిశగా నారా లోకేష్..వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణ 8964 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


  • నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి వైసీపీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి 5వ రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్దిపై 7500 ఓట్ల మెజార్టీ ఆధిక్యంతో ఉన్నారు.


  • 150 స్థానాల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా జోరు కొనసాగుతోంది.


  • హిందూపురం రెండో రౌండ్‌ ముగిసే సరికి నందమూరి బాలకృష్ణ 3671 ఆధిక్యం.


  • భీమవరం ఫలితాల్లో పవన్‌ మూడో స్థానంలో ఉన్నారు.


  • ఐదో రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి,కొడాలి నాని 5380 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


  • నాలుగో రౌండ్ ముగిసే సరికి 7600 ఓట్ల వెనుకంజలో నారా లోకేష్ లీడింగ్ లో కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామ కృష్ణ


  • ఏడో రౌండ్‌ ముగిసే సరికి కుప్పంలో చంద్రబాబు 6260 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


  • విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు వెనుకంజ.ఆయనపై వైకాపా అభ్యర్థి కేకే రాజు 587 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


  • గాజువాకలో మూడో స్థానానికి పడిపోయిన పవన్ కళ్యాణ్


  • గుంటూరు పశ్చిమలో నిలిచిపోయిన కౌంటింగ్


  • సత్తెనపల్లిలో కోడెల వెనుకంజ ఆయనపై వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు 6,175 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


  • బ్రేకింగ్: సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా


  • ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ కు 52 ఓట్లు


  • విశాఖ గాజువాక అసెంబ్లీ స్థానంలో మూడో రౌండ్‌ పూర్తయ్యే సరికి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ 84 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


  • 25న వైసీపీ శాసన సభ పక్ష సమావేశం,30 జగన్ ప్రమాణ స్వీకారం


  • టీడీపీకి పై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్


  • గెలుపు ఆనందంలో వై ఎస్ జగన్ మరియు విజయసాయి రెడ్డి


  • భీమవరం నాలుగో రౌండ్ లో ముందుకు వచ్చిన పవన్


  • విశాఖ పార్లమెంట్ జనసేన అభ్యర్థి వివి లక్ష్మి నారాయణ 8020 ఓట్ల ఆధిక్యం


  • విశాఖ వెస్ట్ టీడీపీ ఆధిక్యం


  • వైసీపీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్ వద్ద పండగ వాతావరణం.భారీగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులు.స్వీట్స్ తినిపించుకుంటున్న నాయకులు,కార్యకర్తలు డప్పులతో,నృత్యాలతో సంబరాలు..


  • కుప్పంలో ఆధిక్యతను కనబరుస్తున్న చంద్రబాబు


  • విశాఖ నార్త్ లో గంటా ఆధిక్యం


  • పార్లమెంటు స్థానాల్లో వైసీపీ జోరు కొనసాగిస్తోంది.మొత్తం 20 లోక్‌సభ స్థానాల్లో వైకాపా ఆధిక్యంలో ఉండగా, తెదేపా 5 చోట్ల ముందంజలో ఉంది


  • మంగళగిరిలో వెనుకంజలో కొనసాగుతున్న నారా లోకేష్


  • రాజోలులో మళ్ళీ ముందంజలోకి వచ్చిన జనసేన


  • గుంటూరు పార్లమెంట్ పరిధిలోని తెనాలి కౌంటింగ్ కేంద్రంలో ఐదు ఈవీఎంల సీరియల్ నంబర్లలో వ్యత్యాసం కనబడడంతో అభ్యంతరం వ్యక్తంచేసిన ఏజంట్లు.దానితో వాటి వరకు లెక్కింపు ఆపి పక్కనపెట్టిన అధికారులు.


  • 50 శాతం ఓట్ షేర్ దిశగా వైసీపీ


  • రాజమండ్రి సిటీ మూడో రౌండ్ లో టీడీపీ ఆధిక్యం


  • మంచు మోహన్‌బాబు : ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే,దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి తన బిడ్డ జగన్‌కు ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు కూడా ఇచ్చారని అన్నారు.


  • తాడేపల్లిగూడెం మూడో రౌండ్ లో వైసీపీ ఆధిక్యం


  • ఏలూరు అసెంబ్లీ 2వరౌండ్లో 592 ఓట్లతో ఆధిక్యత లో వైసీపీ


  • భీమవరం రెండో రౌండ్ లో మూడో స్థానంలో పవన్ కళ్యాణ్


  • మంగళగిరిలో నారా లోకేష్‌పై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి 2816 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


  • నగరిలో ముందంజలో కొనసాగుతున్న రోజా


  • 150 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్న వైసీపీ


  • ఇచ్చాపురంలో వైసీపీ ఆధిక్యం


  • గాజువాకలో పవన్‌ ఆధిక్యం


  • రెండు రౌండ్లు ముగిసేసారికి తూర్పు గోదావరి జిల్లా లీడింగ్ లో ఉన్న పార్టీలు
    కాకినాడ వైసీపీ
    కాకినాడ రూరల్ టీడీపీ
    పిఠాపురం వైసీపీ
    జగ్గంపేట వైసీపీ
    పెద్దాపురం వైసీపీ
    తూని వైసీపీ
    ప్రత్తిపాడు వైసీపీ
    అమలాపురం వైసీపీ
    కొత్తపేట వైసీపీ
    ముమ్మిడివరం టీడీపీ
    పి. గన్నవరం వైసీపీ
    రాజోలు వైసీపీ
    మండపేట టీడీపీ
    రామచంద్రాపురం టీడీపీ
    రాజమహేంద్రవరం టీడీపీ
    రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ
    రాజానగరం వైసీపీ
    అనపర్తి వైసీపీ
    రంపచోడవరం వైసీపీ


  • రాజోల్‌లో మూడో రౌండ్‌లో వైసీపీ అధిక్యం


  • గన్నవరం మూడో రౌండ్ లో టీడీపీ ఆధిక్యం


  • మంగళగిరిలో 14 వేల ఓట్ల అధిక్యంలో వైసీపీ, ఓటమి దిశగా లోకేశ్


  • ఉత్తరాంధ్రలో దూసుకుపోతున్న వైసీపీ


  • పాడేరు రెండో రౌండ్ లో వైసీపీ ఆధిక్యం


  • శ్రీకాకుళంలో 9 స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉంది.


  • భీమవరంలో రెండో స్థానంలో గాజువాకలో మూడో స్థానంలో పవన్


  • మూడో రౌండ్ పూర్తయ్యే సరికి పెనమలూరు నియోజకవర్గంలో 2527ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి కె.పార్థసారధి


  • విజయనగరంలో క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ


  • రెండో రౌండ్ లో కొండేపి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ 6 ఓట్ల ఆధిక్యం


  • రెండో రౌండ్ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ 234 ఓట్ల ఆధిక్యం


  • పెద్దాపురంలో వైసీపీ ఆధిక్యం


  • మూడో రౌండ్ ముగిసే సరికి గుడివాడలో 2600 ఓట్లతో వైసీపీ అధిక్యం


  • పొన్నూర్‌లో రెండో రౌండ్ ముగిసే సరికి 4240 ఓట్ల అధిక్యంలో వైసీపీ


  • బాపట్లలో తొలి రౌండ్ ముగిసే సరికి 1086 ఓట్ల అధిక్యంలో వైసీపీ


  • రాజమండ్రి లోక్ సభలో వైసీపీ ముందంజ


  • సత్తెనపల్లిలో టీడీపీ 322 ఓట్ల ఆధిక్యం


  • విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో క్లీన్ స్వీప్ దిశగా వైయస్ఆర్ సీపీ. 9సీట్లలో స్పష్టమైన ఆధిక్యం


  • ఏపీలో వైయస్ జగన్ ప్రభంజనం 134 సీట్లలో ఆధిక్యంలో వైయస్ఆర్ సీపీ


  • విశాఖ నార్త్‌లో మూడో రౌండ్‌లో మంత్రి గంటా ముందంజ


  • నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు వెనుకంజ


  • తెనాలి తొలి రౌండ్ లో వైసిపి 544 ఓట్లు ఆధిక్యం.


  • నెల్లూరు జిల్లా కొవ్వూరు అసెంబ్లీ స్థానంలో వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 5352 ఓట్లు తేడాతో ముందంజలో ఉన్నారు.


  • అమలాపురం,తుని లో వైసీపీ ముందంజ


  • భీమవరంలో 100 ఓట్ల తేడాతో పవన్ వెనుకంజలో ఉన్నారు.


  • గాజువాకలో టీడీపీ మొదటి రౌండ్ లో లీడ్ లో ఉంది.


  • మంగళగిరిలో ఆధిక్యంలో కొనసాగుతున్న వైయస్ఆర్ సీపీ


  • జిల్లాల వారీగా ఏయేపార్టీలు ఆధిక్యంలో ఉన్నాయో చూద్దాం
    కడప జిల్లాలో టీడీపీ 0, వైసీపీ 10
    అనంతపురం టీడీపీ 2, వైసీపీ 12
    చిత్తూరు టీడీపీ 2, వైసీపీ 8
    శ్రీకాకుళం టీడీపీ 0, వైసీపీ 8
    విజయనగరం టీడీపీ 0, వైసీపీ 9
    విశాఖపట్నం టీడీపీ 1, వైసీపీ 10
    తూర్పు గోదావరి టీడీపీ 5, వైసీపీ 11, జనసేన 1
    పశ్చిమ గోదావరి టీడీపీ 1, వైసీపీ 15
    కృష్ణా టీడీపీ 5, వైసీపీ 9
    గుంటూరు టీడీపీ 6, వైసీపీ 10
    ప్రకాశం టీడీపీ 5, వైసీపీ 7
    నెల్లూరు టీడీపీ 0, వైసీపీ 10


  • కుప్పంలో చంద్రబాబు 1200 ఓట్ల ఆధిక్యంకుప్పంలో చంద్రబాబు 1200 ఓట్ల ఆధిక్యం


  • నరసాపురం పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యం


  • చిత్తూర్ లోక్‌సభలో టీడీపీ అధిక్యం


  • నందిగామ, గన్నవరం, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాలలో వైయస్ఆర్ సీపీ ముందంజ.


  • కాకినాడ పార్లమెంట్ స్థానంలో టీడీపీ ఆధిక్యం


  • గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన వైకాపా అభ్యర్థి కొడాలి నాని ఆధిక్యంలో ఉన్నారు.


  • నంద్యాల లోక్‌సభలో వైసీపీ అధిక్యం


  • విశాఖ నార్త్ లో గంటా 200 ఓట్ల ఆధిక్యం


  • విశాఖలో టీడీపీ 1 వైసీపీ 10 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.


  • నంద్యాల ఆళ్లగడ్డ, అధోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాలలో వైయస్ఆర్ సీపీ ముందంజ.


  • తాడిపత్రి, రాప్తాడు, అనంతపురం అర్బన్ నియోజకవర్గాలలో వైయస్ఆర్ సీపీ ముందంజ.


  • ముమ్మిడివరంలో టీడీపీ ముందంజ


  • రాప్తాడులో పరిటాల శ్రీరాం 3200 ఓట్ల అధిక్యం


  • పర్చూరులో మొదటి రౌండ్ లో టీడీపీ 1245 ఓట్ల ఆధిక్యం


  • పొన్నూరు, వేమూరు, సత్తెనపల్లి, వినుకొండ, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలలో వైయస్ఆర్ సీపీ ముందంజ.


  • కుప్పంలో చంద్రబాబు మళ్ళీ వెనుకంజ


  • ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ ముందంజ


  • రాజమండ్రి రురల్ టీడీపీ ఆధిక్యం


  • సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల వెనుకంజ


  • పెనుగొండలో వైసీపీ ముందంజ


  • ఉరవకొండలో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి 1200 ఓట్లతో ఆధిక్యం


  • ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ వెనుకంజ


  • రాప్తాడులో పరిటాల శ్రీరామ్ వెనుకంజ


  • రోజా 2 వేల ఓట్లతో ముందంజ


  • మంగళగిరిలో నారా లోకేష్ వెనుకంజ


  • ధర్మవరం వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి 270 ఓట్లతో ఆధిక్యం


  • వెనుకంజలో టీడీపీ మంత్రులు


  • గాజువాకలో వైసీపీ ఆధిక్యం


  • చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డప్ప ముందంజ


  • నెల్లూర్ జిల్లాలో 10 చోట్ల వైసీపీ అధిక్యం


  • టీడీపీ అభ్యర్థి అచ్చయ్యనాయుడు వెనుకంజ


  • బొబ్బిలిలో వైసీపీ అధిక్యం


  • పెనమలూరు అసెంబ్లీ లో వైసీపీ ఆధిక్యం


  • విశాఖ నార్త్ లో వైసీపీ ఆధిక్యం


  • మంగళగిరిలో లోకేశ్ వెనుకంజ


  • తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆధిక్యం


  • కర్నూల్ పార్లమెంట్ లో వైసీపీ ఆధిక్యం


  • మచీలీపట్నం లోక్‌సభ స్థానంలో టీడీపీ ముందంజ


  • హిందూపురంలో బాలకృష్ణ 107 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


  • కొవ్వూరులో మొదటి రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 2170 ఓట్లతో ముందంజ


  • పలమనేరులో వెనుకబడ్డ వైసీపీ అభ్యర్థి అమర్ నాథ్ రెడ్డి


  • మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర వెనుకంజ


  • పోలవరంలో వైసీపీ ఆధిక్యం


  • విశాఖ పార్లమెంట్ స్థానంలో వివి లక్ష్మీ నారాయణ ముందంజ


  • గుడివాడ మొదటి రౌండ్ లో కొడాలి నాని ముగిసేసరికి 1637 ఓట్లతో ఆధిక్యం


  • మచిలీపట్నం అసెంబ్లీ లో వైసీపీ ఆధిక్యం


  • పలమనేరు అసెంబ్లీ లో వైసీపీ ఆధిక్యం


  • హిందూపురంలో బాలకృష్ణ ముందంజ


  • మండపేటలో టీడీపీ ఆధిక్యం


  • ఆదోని అసెంబ్లీ లో వైసీపీ ఆధిక్యం


  • పాడేరు అసెంబ్లీ లో వైసీపీ ఆధిక్యం


  • బాపట్లలో వైసీపీ ఆధిక్యంలో ఉంది.


  • కుప్పంలో చంద్రబాబు 67 ఓట్ల తేడాతో వెనుకంజ


  • పోస్టల్ బ్యాలెట్‌లో ఇంకా ఖాతా తేరవని కేఏ పాల్


  • కుప్పంలో చంద్రబాబు వెనుకంజ


  • ముమ్మిడివరంలో జనసేన అభ్యర్థి పితాని బాలకృష్ణ ముందంజ


  • ఇప్పటికి మొత్తం 75 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది.


  • పుట్టపర్తిలో వైసీపీ ముందంజ


  • పామర్రు అసెంబ్లీ లో వైసీపీ ఆధిక్యం


  • తాడేపల్లి గూడెంలో వైసీపీ ఆధిక్యం


  • మంత్రాలయం అసెంబ్లీ లో టిడిపి ఆధిక్యం


  • గుంటూరు ఈస్ట్,వెస్ట్ లో టీడీపీ ముందంజ


  • ఏలూరు పార్లమెంట్ స్థానంలో వైసీపీ ముందంజ.


  • ఆవనిగడ్దలో వైసీపీ ముందంజ


  • మాచర్ల అసెంబ్లీ లో వైసీపీ ఆధిక్యం


  • యలమంచిలిలో వైసీపీ ఆధిక్యం


  • చీపురుపళ్ళిలో బొత్స సత్యనారాయణ మూడు వేల ఓట్లతో ముందంజ


  • పాలకొల్లులో టీడీపీ ముందంజ


  • నంద్యాల అసెంబ్లీ లో వైసీపీ ఆధిక్యం


  • రాజాం లో 980 ఓట్లతో వైసీపీ ఆధిక్యం


  • ఎచ్చెర్లలో కళా వెంకట్రావు ముందంజ


  • చోడవరం లో 450 ఓట్లతో వైసీపీ ఆధిక్యం


  • అనపర్తి లో 5400 ఓట్లతో వైసీపీ ఆధిక్యం


  • టెక్కలిలో వైసీపీ 1600 ఓట్ల ఆధిక్యం


  • ఆలూరు,పత్తికొండ లో అసెంబ్లీ లో వైసీపీ ఆధిక్యం


  • ఏలూరు,దెందులూరులో వైసీపీ ఆధిక్యం


  • అరకు పార్లమెంట్ లో 1500 ఓట్లతో వైసీపీ ఆధిక్యం


  • గుంటూరులో 1500 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ


  • రైల్వే కోడూరు లో అసెంబ్లీ లో వైసీపీ ఆధిక్యం


  • ఉదయగిరిలో వైసీపీ ముందంజ


  • అమలాపురం,కాకినాడ పార్లమెంట్ స్థానంలో టీడీపీ ఆధిక్యం


  • పిఠాపురంలో వైసీపీ ముందంజ


  • పాణ్యం లో 457 తో ఓట్ల వైసీపీ ఆధిక్యం


  • రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో టీడీపీ ఆధిక్యం


  • రాయదుర్గం లో అసెంబ్లీ లో వైసీపీ ఆధిక్యం


  • నగరిలో రోజా ముందంజలో ఉన్నారు.


  • అనపర్తి తొలి రౌండ్ లో వైసీపీ 5000 ఓట్ల ఆధిక్యం


  • తంబళపళ్ళిలో టీడీపీ అధిక్యం


  • కందుకూరులో మొరాయించిన ఈవీఎంలు, ఆగిపోయిన కౌంటింగ్


  • గుంటూరు పార్లమెంట్ స్థానంలో గల్లా జయదేవ్ ఆధిక్యం


  • చిత్తూరులో ఆధిక్యం కనబరుస్తున్న వైసీపీ


  • పులివెందులలో జగన్ 2000 ఓట్లతో ముందంజ


  • పెదకూరపాడులో వైసీపీ 1500 ఓట్లతో ముందంజ


  • కాకినాడ,అమలాపురం పార్లమెంట్ స్థానాలో టీడీపీ ఆధిక్యం


  • కొండేపి అసెంబ్లీ స్థానంలో టీడీపీ ముందంజ


  • భీమవరంలో పవన్ కళ్యాణ్ పై 625 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ముందంజ


  • రాజోలులో తొలి రౌండ్‌లో జనసేన 336 ఓట్ల అధిక్యం


  • కొత్త పేట అసెంబ్లీ స్థానంలో టీడీపీ ఆధిక్యం


  • బద్వేల్ మరియు సర్వేపల్లి లో వైసీపీ ముందంజ


  • అనంతపురం అర్బన్ లో వైసీపీ 125 ఓట్లతో ముందంజ


  • భీమవరం పోస్టల్ బ్యాలట్ లో పవన్ కళ్యాణ్ వెనుకంజ.


  • శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానంలో వైసీపీ ముందంజ


  • కడప పార్లమెంట్ స్థానంలో అవినాష్ వైసీపీ ముందంజలో ఉన్నారు.


  • పెద్దాపురం అసెంబ్లీ స్థానంలో టీడీపీ ముందంజ


  • విజయనగరం మొదటి రౌండ్ లో వైసీపీ 265 ఓట్ల ఆధిక్యంలో ఉంది


  • మైదుకూరులో వైసీపీ 1296 ఓట్ల ఆధిక్యం


  • కొత్తపేటలో వైసీపీ 625 ఓట్ల ఆధిక్యం


  • భీమవరం,గాజువాకలో ఆధిక్యంలో దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్.


  • అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అధిక్యం


  • భీమవరం,గాజువాకలో జనసేన ఆధిక్యం.


  • వినుకొండ, నందిగామలో వైసీపీ ముందంజ


  • పోస్టల్ బ్యాలట్లో జనసేన వెనుకంజలో ఉంది.


  • విశాఖ పార్లమెంట్ స్థానంలో టీడీపీ ఆధిక్యం


  • ప్రారంభం అయిన ఈవీఎంల కౌంటింగ్


  • మొత్తం 8 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉండగా రెండు స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉంది.


  • గుంతకల్లు పోస్టల్ బ్యాలట్ లో వైసీపీ ముందంజ


  • అమలాపురం లోక్ సభ స్థానంలో వైసీపీ ఆధిక్యం


  • మైదుకూరు లోక్ సభ స్థానంలో వైసీపీ ఆధిక్యం


  • కమలాపురంలో వైసీపీ అధిక్యం


  • అనంతపురం పార్లమెంటు స్థానంలో వైసీపీ ఆధిక్యం కనబరుస్తుంది.


  • ఇప్పటికి మొత్తం 8 స్థానాల్లో వైసీపీ ఆధిక్యం


  • దర్శి పోస్టల్ బ్యాలట్ లో వైసీపీ ముందంజలో ఉంది.


  • కావలిలో వైసీపీ ఆధిక్యం


  • ఎర్రగొండ పాలెంలో వైసీపీ లీడ్


  • మంగళగిరిలో నారా లోకేశ్ అధిక్యం


  • అనంతపురం రురల్ లో వైసీపీ ఆధిక్యం


  • పులివెందులలో ఆధిక్యం కనబరుస్తున్న వైఎస్ జగన్


  • పార్వతీపురంలో వైసీపీ ఆధిక్యం


  • ఇచ్చాపురంలో లీడ్ లో ఉన్న వైసీపీ.


  • నెల్లూర్ సిటీలో వైసీపీ అధిక్యం


  • టెక్కలిలో అచ్చేయనాయుడు వెనుకంజలో ఉన్నారు.


  • ఒంగోలు అసెంబ్లీ స్థానంలో వైసీపీ ముందంజ


  • అరకు,పాలకొండలో వైసీపీ ఆధిక్యం


  • చీపురుపల్లి పోస్టల్ బ్యాలట్లో బొత్స సత్యన్నారాయణ ముందంజలో ఉన్నారు.


  • దర్శి పోస్టల్ బ్యాలెట్‌లో వైసీపీ ముందంజ


  • శ్రీకాకుళం రాజాంలో వైసీపీ ముందంజలో ఉంది.


  • ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మరియు చిత్తూరు, పూతలపట్టు, కడప, అనంతపురంలో వైసీపీ ముందంజలో ఉంది.


  • అమలాపురం పోస్టల్ బ్యాలట్ లో వైసీపీ ముందంజలో ఉంది.


  • చంద్రగిరి ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య గొడవ తలెత్తింది...


  • చంద్రగిరి ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య గొడవ తలెత్తింది...


  • చంద్రగిరి ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య గొడవ తలెత్తింది...


  • కడప ఎంపీ స్థానంలో వైసీపీ ముందంజలో ఉంది.


  • విద్యుత్ సరఫరా లేకపోవడంతో కాకినాడ రూరల్ స్ట్రాంగ్ రూమ్స్ లో గందరగోళంలో అభ్యర్థులు.


  • శ్రీకాకులం జిల్లా పాతపట్నం పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీ ఆధిక్యం కనబరుస్తుంది.


  • ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ మరియు లోక్‌సభకు మొత్తం 5,03,199 పోస్టల్‌ బ్యాలెట్లు పోలయ్యాయి.


  • మొదటగా గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ నల్లపాడు లయోలా స్కూల్ లో మెదలయ్యింది.


  • ఏపీకు సంబంధించి రానున్న అసెంబ్లీ ఫలితాల్లో మొత్తం 175 స్థానాల్లో 88 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ గా ఉంది.


  • ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఐదు వీవీప్యాట్లను లెక్కించి ఈవీఎం ఓట్లతో పోల్చుతారు.


  • పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు అనంతరం ఈవీఎం లలో ఫలితాలు లెక్కించనున్నారు.


  • మొట్టమొదట పోస్టల్ బ్యాలట్లు లెక్కపెట్టనున్నారు.


  • గ్రామీణ ప్రాంతం అయినటువంటి రంపచోడవరం శాసనసభ తాలూకా ఫలితాలు ఆఖరున బయటపడనున్నాయి.


  • కాసేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ.


  • మొట్టమొదట పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ ఫలితాలు విడుదలవుతాయి.



Bookmark and Share