తెలంగాణ మరియు జాతీయ స్థాయి లోక్ సభ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్

 

Andhra Pradesh Assembly and Lok Sabha Election Results Live Updates


 • తెలంగాణ లోక్‌సభ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థుల జాబితా

 • తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను టీఆర్ఎస్ 9 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 3 స్థానాలను, బీజేపీ 4 స్థానాలను. ఎంఐఎం 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.


 • తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలలో గెలుపొందిన అభ్యర్థులు

  సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి (బీజేపీ)
  హైదరాబాద్ - అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం)
  మల్కాజ్‌గిరి - రేవంత్ రెడ్డి (కాంగ్రెస్)
  నల్గొండ - ఉత్తం కుమార్ రెడ్డి (కాంగ్రెస్)
  భువనగిరి - కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (కాంగ్రెస్)
  చేవెళ్ళ - రంజిత్ రెడ్డి (టీఆర్ఎస్)
  మహబూబ్‌నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి (టీఆర్ఎస్)
  నాగర్‌కర్నూల్ - పి. రాములు (టీఆర్ఎస్)
  వరంగల్ - పసునూరి దయాకర్ (టీఆర్ఎస్)
  మెదక్ - కొత్త ప్రభాకర్ రెడ్డి (టీఆర్ఎస్)
  జహీరాబాద్ - బీబీపాటిల్ (టీఆర్ఎస్)
  అదిలాబాద్ - సోయం బాపురావ్ (బీజేపీ)
  ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు (టీఆర్ఎస్)
  మహబూబాబాద్ - మాలోత్ కవిత (టీఆర్ఎస్)
  నిజామాబాద్ - ధర్మపురి అరవింద్ (బీజేపీ)
  పెద్దపల్లి - బి. వెంకటేశ్ నేత (టీఆర్ఎస్)
  కరీంనగర్ - బండి సంజయ్ (బీజేపీ)


 • చేవెళ్ళలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓటమి, 8840 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు


 • చేవెళ్ళలో కొనసాగుతున్న టీఆర్ఎస్ అధిక్యం, 8 వేల ఓట్లకు పైగా అధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ముందంజ


 • భోపాల్ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఓటమి


 • క్రికెటర్‌, తూర్పు దిల్లీ భాజపా అభ్యర్థి గౌతం గంభీర్‌ విజయం సాధించారు.


 • హైదరాబాద్ లోక్‌సభలో ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఒవైసీ గెలుపు


 • నిజామాబాద్ లో ఓటమి పాలైన కవిత


 • సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి విజయం


 • నిజామబాద్‌లో లోక్‌సభ నియోజకవర్గంలో 4వ రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి అరవింద్ 68,667 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


 • చేవెళ్లలో 2781 ఓట్ల అధిక్యంలో టీఆర్ఎస్


 • కొవ్వూరులో వైసీపీ అభ్యర్థి వనిత ఘన విజయం


 • మాండ్యాలో 90 వేల ఓట్ల మెజారిటీతో సుమలత విజయం


 • సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి 60 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు


 • సొంతంగా 299 సీట్లు సాధించిన బీజేపీ.. 50 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్


 • తెలంగాణలో ఇప్పటి వరకు గెలుపొందిన లోక్‌సభ స్థానాల వివరాలు

  మల్కాజ్‌గిరి - రేవంత్ రెడ్డి (కాంగ్రెస్)
  నల్గొండ - ఉత్తం కుమార్ రెడ్డి (కాంగ్రెస్)
  భువనగిరి - కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (కాంగ్రెస్)
  చేవెళ్ళ - కొండా విశ్వేశ్వర్ రెడ్డి (కాంగ్రెస్) క్ష్
  మహబూబ్‌నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి (టీఆర్ఎస్)
  నాగర్‌కర్నూల్ - పి. రాములు (టీఆర్ఎస్)
  వరంగల్ - పసునూరి దయాకర్ (టీఆర్ఎస్)
  మెదక్ - కొత్త ప్రభాకర్ రెడ్డి (టీఆర్ఎస్)
  జహీరాబాద్ - బీబీపాటిల్ (టీఆర్ఎస్)
  ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు (టీఆర్ఎస్)
  మహబూబాబాద్ - మాలోత్ కవిత (టీఆర్ఎస్)
  పెద్దపల్లి - బి. వెంకటేశ్ నేత (టీఆర్ఎస్)
  కరీంనగర్ - బండి సంజయ్ (బీజేపీ)


 • పెద్దపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి బి. వెంకటేశ్ నేత ఘన విజయం


 • ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు ఘన విజయం


 • జహీరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి బీబీపాటిల్ విజయం


 • ఈ నెల 29న మరోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం, మోదీ ప్రమాణ స్వీకారానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే అవకాశం


 • నిజామాబాద్‌ లోక్‌ సభ తెరాస అభ్యర్థి కె.కవిత 60వేల పైచిలుకు ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నట్టు తెలుస్తుంది.


 • మహబూబాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత ఘన విజయం


 • అమేధిలో స్వల్ఫ ఆధిక్యంలో స్మృతీ ఇరానీ


 • నాగర్‌కర్నూల్‌లో 1 లక్షా 80 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పి. రాములు


 • మహబూబ్‌నగర్ లోక్‌సభలో 77,121 ఓట్ల మెజారిటీతో మన్నె శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం


 • కర్ణాటకలోని తుమకూరు లోక్‌సభలో మాజీ ప్రధాని దేవేగౌడ ఓటమి


 • మధురలో గెలుపు దిశగా హేమామాలిని


 • సిక్కిం అసెంబ్లీ ఎన్నికలలో ఇప్పటివరకు ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్, బీజేపీ


 • గాంధీ నగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఘన విజయం


 • తెలంగాణలో ఇప్పటి వరకు నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్. నల్గొండ, మల్కాజ్‌గిరి, చేవెళ్ళ, భువనగిరిలో టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ఘన విజయం.


 • చేవెళ్ళ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘన విజయం


 • కరీంనగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలుపు


 • 5000 వేల ఓట్ల మెజార్టీతో రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నుంచి గెలుపు


 • మల్కాజ్‌గిరిలో 18వ రౌండ్‌ పూర్తయ్యేసరికి రేవంత్‌ రెడ్డి 9671 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


 • బెంగళూరు సెంట్రల్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఓటమి.ఇక్కడ భాజపా అభ్యర్థి పీసీ మోహన్‌ విజయం సాధించారు..


 • మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి స్వల్ప ఓట్ల మెజార్టీతో ముందున్నారు.


 • వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్‌ విజయం


 • నల్గొండలో 19070 ఓట్ల మెజారిటితో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తం కుమార్ రెడ్డి ఘన విజయం


 • పెద్దపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి బి. వెంకటేశ్ నేత 71,008 ఓట్ల అధిక్యం


 • లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ తెరాస అభ్యర్థి పోతుగంటి రాములు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిపై లక్షా 80వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.


 • అదిలాబాద్ 52,927 ఓట్లతో బీజేపీ అభ్యర్థి సోయం బాబురావ్ ముందంజ


 • చేవెళ్ల 10 వేల ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి


 • ఓటమి బాధతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన భువనగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్


 • బ్రేకింగ్: భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కోమటి రెడ్డి విజయభేరి


 • చేవెళ్ల 10 వేల ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి


 • ఓటమి బాధతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన భువనగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్


 • బ్రేకింగ్: భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కోమటి రెడ్డి విజయభేరి


 • భువనగిరిలో 2588 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి కోమటి రెడ్డి


 • మల్కాజ్ గిరి నుంచి రేవంత్ రెడ్డి 2100 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు


 • మెదక్‌లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఘన విజయం


 • వయనాడు నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ


 • 344 లోక్‌సభ స్థానాలలో ముందంజలో ఉన్న ఎన్‌డీయే


 • ఏపీలో ఘన విజయం సాధించిన వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్


 • సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్


 • మల్కాజ్‌గిరిలో 705 ఓట్ల అధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి


 • ప్రస్తుతం టీఅర్ఎస్ అధిక్యంలో కొనసాగుతున్న స్థానాలు

  మహబూబ్‌నగర్ - 44,997 ఓట్లతో టీఆర్ఎస్ అధిక్యం
  నాగర్‌కర్నూల్ - 1,60,492 ఓట్లతో టీఆర్ఎస్ అధిక్యం
  వరంగల్ - 2,72,420 ఓట్లతో టీఆర్ఎస్ అధిక్యం
  మెదక్ - 2,76,024 ఓట్లతో టీఆర్ఎస్ అధిక్యం
  జహీరాబాద్ - 18,577 ఓట్లతో టీఆర్ఎస్ అధిక్యం
  ఖమ్మం - 69,444 ఓట్లతో టీఆర్ఎస్ అధిక్యం
  మహబూబాబాద్ - 1,17,051 ఓట్లతో టీఆర్ఎస్ అధిక్యం
  పెద్దపల్లి - 47,739 ఓట్లతో టీఆర్ఎస్ అధిక్యం
  మల్కాజ్‌గిరి - 1906 ఓట్లతో టీఆర్ఎస్ అధిక్యం


 • నిజామాబాద్‌ తెరాస అభ్యర్థి కె.కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ 31వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


 • ఖమ్మంలో 69,444 ఓట్ల ముందంజలో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు


 • మల్కాజ్ గిరి నుంచి రేవంత్ రెడ్డి 1500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


 • తెలంగాణలో సత్తా చాటుతున్న కాంగ్రెస్,బీజేపీ చెరో నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి


 • కర్నాటక బళ్ళారిలో విజయం సాధించిన బీజేపీ


 • రాయ్ బరేలిలో సోనియా గాంధీ అధిక్యం


 • మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఆధిక్యం. ఏడో రౌండ్‌ ముగిసే సరికి 3781 ఓట్ల మెజార్టీ.


 • మెదక్‌లో 2 లక్షల 11 వేల ఓట్ల మెజారిటితో దూసుకుపోతున్న తెరాస అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి


 • 14 వేల ఓట్ల ఆధిక్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి


 • బీజేపీ తొలి విజయం : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తొలి విజయం నమోదైంది. దమన్‌ దయ్యూలో ఆ పార్టీ అభ్యర్థి లాలూభాయ్‌ పటేల్ ఘన విజయం సాధించారు.


 • కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి 74 వేల ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు.


 • వారణాసిలో 82 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్న మోదీ


 • సికింద్రాబాద్‌లో ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి 30 వేల ఓట్ల అధిక్యంలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి


 • చేవెళ్ళలో 1412 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి


 • ఒడిసాలో దూసుకుపోతున్న బీజేడీ, వంద సీట్లు కైవసం చేసుకునే దిశగా బీజేడీ, ఐదో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నవీన్ పట్నాయక్


 • అదిలాబాద్‌లో 32 వేల ఓట్ల ముందంజలో కొనసాగుతున్న బీజేపీ


 • బీహార్, మహరాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలో క్లీన్ స్వీప్ దిశగా బీజేపీ


 • భువనగిరిలో కేవలం 1000 ఓట్ల వెనుకంజలో కోమటి రెడ్డి


 • గాంధీనగర్‌లో లక్షా 25 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్న అమిత్ షా


 • చెవేళ్ల, నల్గొండ, మల్కాజ్‌గిరిలలో కాంగ్రెస్ ముందంజ


 • హైదరాబాద్‌లో 7523 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్న ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ


 • మల్కాజ్‌గిరిలో 4 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి


 • అదిలాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో బీజేపీ ముందంజ


 • నాగర్‌కర్నూల్‌లో 62,453 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ అభ్యర్థి పీ. రాములు


 • ఖమ్మం 7వ రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ 33,085 ఓట్ల ముందంజలో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు


 • భువనగిరిలో 18 వేల ఓట్ల అధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్


 • జహీరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి బీబీపాటిల్‌కు 22,823 ఓట్ల అధిక్యం


 • వరంగల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి 65,145 ఓట్ల అధిక్యం


 • మహబూబ్‌నగర్‌లో 12వ రౌండ్ పూర్తయ్యే సరికి 24,382 ఓట్ల మెజారిటీతో మన్నె శ్రీనివాస్ ముందంజ


 • నల్గొండలో 7 వేల ఓట్ల అధిక్యంలో ఉత్తం కుమార్ రెడ్డి


 • మెదక్‌లో టీఆర్ఎస్ ప్రభంజనం: లక్ష ఓట్ల మెజారిటితో తెరాస అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ముందంజ


 • తెలంగాణలోని 17 స్థానాలలో టీఆర్ఎస్ 9 స్థానాలలో ముందంజలో కొనసాగుతుండగా, మూడు స్థానాలలో కాంగ్రెస్, 4 స్థానాలలో బీజేపీ, ఒక స్థానంలో ఎంఐఎం లు కొనసాగుతున్నాయి.


 • నిజామాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత వెనుకంజ


 • అదిలాబాద్‌లో 18 వేల ఓట్లతో బీజేపీ ముందంజ


 • కరీంనగర్‌లో 22 వేల ఓట్లతో బీజేపీ ముందంజ


 • హైదరాబాద్‌లో ఎంఐఎం ముందంజ


 • మల్కాజ్‌గిరిలో 20 వేల ఓట్లతో రేవంత్ రెడ్డి అధిక్యం


 • నల్గొండలో కాంగ్రెస్ ముందంజ


 • వయనాడ్‌లో రాహుల్ ముందంజ, అమేథిలో రాహుల్ వెనుకంజ


 • మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ వెనుకంజ


 • సికింద్రాబాద్‌లో బీజేపీ ముందంజ


 • అదిలాబాద్, కరీంనగర్‌లో బీజేపీ ముందంజ


 • మహబూబాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత ముందంజ


 • మెదక్‌లో 32,593 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి


 • భువనగిరిలో కోమటి రెడ్డి వెనుకంజ


 • సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి వెనుకంజ


 • నల్గొండలో ఉత్తం వెనుకంజ


 • పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో టీఆర్ఎస్ ముందంజ


 • యూపీలో బీజేపీ 50 స్థానాలలో ముందంజ


 • భువనగిరి లోక్‌సభ స్థానంలో టీఆర్ఎస్ లీడ్


 • నల్గొండ రెండో రౌండ్‌లో కాంగ్రెస్ లీడ్


 • తెలంగాణలో 17 స్థానాలకుగాను 14 స్థానాలలో టీఆర్ఎస్ ముందంజలో ఉండగా, ఒక స్థానంలో కాంగ్రెస్, బీజేపీలు ముందంజలో ఉన్నాయి.


 • చేవేళ్ళలో కాంగ్రెస్ ముందంజ


 • వరంగల్‌లో టీఆర్ఎస్ ముందంజ


 • నల్గొండలో స్వల్ఫ అధిక్యంలో టీఆర్ఎస్


 • మల్కాజ్‌గిరిలో టీఆర్ఎస్ ముందంజ


 • కరీంనగర్‌లో బీజేపీ అధిక్యం


 • తెలంగాణ లోక్‌సభ స్థానాలలో తెరాస జోరు కొనసాగుతుంది. తొలి రౌండ్‌లో అథ్యధిక స్థానాలలో తెరాస ముందంజలో ఉంది.


 • హైదరాబాద్‌లో బీజేపీ ముందంజ


 • సికింద్రాబాద్‌లో తలసాని సాయి కిరణ్ యాదవ్ అధిక్యం


 • ఈస్ట్ ఢిల్లీలో క్రికెటర్ గౌతం గంభీర్ ముందంజ


 • జహీరాబాద్, మెదక్, ఖమ్మంలో టీఆర్ఎస్ ముందంజ


 • అమేథిలో రాహుల్ వెనుకంజ


 • ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీక్షించిన మల్కాజ్‌గిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి


 • మాండ్యాలో సుమలత ముందంజ


 • బెంగుళూర్ సెంట్రల్‌లో హీరో ప్రకాశ్ రాజ్ వెనుకంజ


 • రెండు స్థానాలలో టీఆర్ఎస్ అధిక్యం


 • గాంధీనగర్‌లో అమిత్‌షా ముందంజ


 • మొదటి రౌండ్లో ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ముందంజ


 • మెదక్ లో తెరాస ఆధిక్యం


 • జహీరాబాద్ లోక్‌సభ స్థానంలో టీఆర్ఎస్ ముందంజ


 • సికింద్రాబాద్ పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్‌లో టీఆర్ఎస్ ముందంజ


 • మొట్టమొదట పోస్టల్ బ్యాలట్లు లెక్కపెట్టనున్నారు.


 • కాసేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ.Bookmark and Share