ధనవంతులే కాదు, దానశీలులు కూడా అనిపించుకున్న భారత కుబేరులు వీరే..!

 2018 సంవత్సరానికి గాను చైనాకు చెందిన హ్యూరన్ ఇండియా సంస్థ రూపొందించిన దాన శీలుల జాబితా విడుదలైంది, ఈ జాబితాలో 39మంది భారతీయులు ఉండగా వారిలో మంజు డి. గుప్తా ఒక్కరే భారత మహిళ కావటం విశేషం.2017 అక్టోబర్ 1నుండి 2018 సెప్టెంబర్ 30వరకు దాతృత్వ కార్యకలాపాల కోసం 10కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిన ధనవంతుల జాబితాతో హ్యూరన్ ఇండియా సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం భారతీయులు సగటున 40కోట్ల రూపాయల చొప్పున చారిటీ కార్యక్రమాల కోసం మొత్తంగా 1560కోట్లు ఖర్చు చేసారు. దానశీలుల జాబితాలో ముందు వరుసలో నిలిచినా ఐదుగురు భారత సంపన్నుల వివరాలు ఇలా ఉన్నాయి:

టాప్ 5: యూసుఫ్ అలీ ఎంఏ:

లులూ గ్రూప్స్ అధినేత ఎంఏ యూసుఫ్ అలీ 2018సంవత్సరానికి గాను దాతృత్వ కార్యకలాపాల కోసం 70కోట్ల రూపాయలు ఖర్చు చేసి అయిదవ స్థానంలో నిలిచారు. ఈయన దుబాయ్ కేర్స్ సంస్థతో కలిసి గాజా, జపాన్ లలో పలు పాఠశాలలను దత్తత తీసుకున్నాడు. అంతే కాకుండా గతంలో గుజరాత్ లో భూకంపం సమయంలో విరాళం, ఆసియా సునామి రిలీఫ్ ఫండ్ కు విరాళం, ఇవ్వటంతో పాటుగా ప్రపంచంలో పలు చోట్ల ప్రాకృతిక విపత్తులు వచ్చినప్పుడు విరాళాలు అందించారు.

Bookmark and Share