ధనవంతులే కాదు, దానశీలులు కూడా అనిపించుకున్న భారత కుబేరులు వీరే..!

 టాప్ 1: ముఖేష్ అంబానీ:

దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ దాతృత్వంలో కూడా ముందు వరుసలో నిలవటం విశేషం, ఈయన 2018 సంవత్సరానికి గాను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) లో భాగంగా చారిటీ కోసం 437కోట్లు ఖర్చు చేసి ప్రధమ స్థానంలో నిలిచారు. రిలయన్స్ ఫౌండేషన్ తరఫున విద్యా సదుపాయాల రూపకల్పన కోసం ముకేశ్ అంబానీ ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు, దీంతో పాటుగా గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ వంటి వాటికోసం కూడా ఆయన చారిటీ కార్యక్రమాలు చేస్తున్నట్టు నివేదిక వెల్లడించింది.

Bookmark and Share